పాకిస్తాన్‌కు అమెరికా పౌరులు వెళ్లవద్దు: అమెరికా

పాకిస్తాన్‌కు వెళ్లవద్దని అమెరికా తమ పౌరులను హెచ్చరించింది. పాకిస్తాన్‌లో అమెరికన్లపై దాడులు జరిగే అవకాశం ఉందని.. తమకు అమెరికన్ పౌరుల సురక్షితం ముఖ్యమని పేర్కొనింది.

Last Updated : Dec 9, 2017, 07:26 PM IST
పాకిస్తాన్‌కు అమెరికా పౌరులు వెళ్లవద్దు: అమెరికా

పాకిస్తాన్‌కు వెళ్లవద్దని అమెరికా తమ పౌరులను హెచ్చరించింది. పాకిస్తాన్‌లో అమెరికన్లపై దాడులు జరిగే అవకాశం ఉందని.. తమకు అమెరికన్ పౌరుల సురక్షితం ముఖ్యమని పేర్కొంది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారని.. ఉగ్రదాడులు ఆత్మాహుతి దాడులు చేస్తున్నారని ప్రకటించింది. ఎవరైనా పాకిస్తాన్ పర్యటనలకు బయలుదేరుతుంటే.. తమ ప్రయాణాలను రద్దుచేసుకోవలసిందిగా అమెరికా తమ పౌరులకు సూచించింది. 

ఇదిలా ఉండగా కరాచీ, లాహోర్, పెషావర్, ఇస్లామాబాద్ ప్రాంతాల్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలు చాలావరకు వివిధ సేవలను నిలిపివేశాయి. పాకిస్తాన్‌లో పరిస్థితి తీవ్రంగా ఉందని వైట్ హౌస్‌కు ఒక నివేదికను కూడా పంపారు పెషావర్ రాయబార కార్యాలయం. 'ఉగ్రవాదులు ఎక్కడిపడితే అక్కడ అడ్డుఅదుపు లేకుండా ఆత్మాహుతి దాడులకు తెగబడుతున్నారని.. వారు అమెరికా దౌత్య అధికారులపై కక్ష పెంచుకున్నారని  నివేదికలో పేర్కొంది.

Trending News