TikTok versus Amazon: అమెజాన్ యూ టర్న్‌కు కారణమేంటి?

ప్రముఖ ఆన్‌లైన్ దిగ్గజం ఆ విషయంలో యూ టర్న్ తీసుకుంది. కేవలం పొరపాటు కారణంగానే అలా జరిగిందని వ్యాఖ్యానించింది. నిషేధం విషయంలో తమకెలాంటి విధానాలు లేవని స్పష్టం చేసింది. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయమా లేదా మరో కారణముందా ?   అసలేం జరిగింది ? టిక్‌టాక్ వర్సెస్ అమెజాన్ విషయమేంటి ?

Last Updated : Jul 11, 2020, 02:22 PM IST
TikTok versus Amazon: అమెజాన్ యూ టర్న్‌కు కారణమేంటి?

ప్రముఖ ఆన్‌లైన్ దిగ్గజం ఆ విషయంలో యూ టర్న్ తీసుకుంది. కేవలం పొరపాటు కారణంగానే అలా జరిగిందని వ్యాఖ్యానించింది. నిషేధం విషయంలో తమకెలాంటి విధానాలు లేవని స్పష్టం చేసింది. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయమా లేదా మరో కారణముందా ?   అసలేం జరిగింది ? టిక్‌టాక్ వర్సెస్ అమెజాన్ విషయమేంటి ? 

టిక్‌టాక్ యాప్ ( Tik/tok App ) పై అమెజాన్ ( Amazon )  సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. చైనా యాప్ టిక్‌టాక్ పై నిషేధం విషయంలో ప్రపంచదేశాలు అనుసరిస్తున్న విధానాలు, నిషేధం వ్యవహారం ఇప్పుడు  చర్చనీయాంశమవుతోంది. దీనికి కారణం ప్రముఖ ఆన్‌లైన్ దిగ్గజమైన అమెజాన్ ( Amazon )  టిక్‌టాక్ యాప్ ( Ban on Tiktok App ) పై నిషేధం విషయంలో తీసుకున్న యూ టర్న్. వాస్తవానికి తమ ఫోన్ల నుంచి టిక్‌టాక్ యాప్ ను తొలగించాలంటూ ఆ సంస్థ తమ ఉద్యోగులకు ఓ మెయిల్ పంపింది. ఇది భారీగా చర్చకు దారితీసింది. టిక్‌టాక్ ప్రతినిధి ఈ విషయం చేరడంతో విషయం కాస్తా రచ్చైంది. దీంతో అమెజాన్ ప్రతినిధి జాకీ అండర్సన్ తో చర్చలు జరిపారు టిక్‌టాక్ ప్రతినిధి. అంతే..అమెజాన్ సంస్థ తాను తీసుకున్న నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గింది. యాప్ లు తొలగించాలన్న తన నిర్ణయంపై యూ టర్న్ తీసుకుంది. ఆ మెయిల్ పొరపాటుగా పంపామని, నిషేధం విషయంలో ఎటువంటి విధానాలు తమకు లేవని అమెజాన్ సంస్థ స్పష్టం చేసింది. అసలేం జరిగింది ? ఎందుకిలా జరిగిందనే విషయంపై మాట్లాడటానికి అమెజాన్ సంస్థ ప్రతినిధైన జాకీ అండర్సన్ నిరాకరించారు. Also read: Covid 19: నెలాఖరుకు ఇండియా పరిస్థితి ఏంటి?

ఇండో చైనా సరిహద్దు ( Indo china border dispute ) వివాదం నేపధ్యంలో టిక్‌టాక్ సహా 59 చైనా దేశపు యాప్ ( China Apps )  లను భారత ప్రభుత్వం ( Indian Government ) నిషేధం విధించింది. అమెరికా సైతం ఇదే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికా విదేశాంగ శాఖ మైక్ పాంపియో ( Mike pompeo ) ఇదే విషయాన్ని వెల్లడించారు. రిపబ్లికన్ జాతీయ కమిటీ ( Republican party national committee )  అయితే టిక్‌టాక్ యాప్ ను డౌన్‌లోడ్ చేయవద్దంటూ సభ్యులకు మెయిల్ కూడా చేసింది. సైబర్ ముప్పు కారణాన్ని చూపిస్తూ..అమెరికన్ నేవీ కూడా టిక్‌టాక్ ను ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.  Also read:Billionaires: వారెన్ బఫెట్ కాదు..ఇప్పుడు ముఖేష్ అంబానీ

అమెరికా ( America ) దేశం సైతం టిక్‌టాక్ పై నిషేధం దిశగా  అడుగులు వేస్తున్న క్రమంలో అదే దేశపు సంస్థ టిక్‌టాక్ యాప్ నిషేదంపై యూ టర్న్ ఎందుకు తీసుకోవవల్సివచ్చిందనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపార పరంగానే అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుందా లేదా మరో కారణమేదైనా ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా...టిక్‌టాక్ పై పెరుగుతున్న ఆరోపణలు, ఆందోళనల నేపధ్యంలో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ ( Bytedance ) సంస్థాగతమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. టిక్‌టాక్ ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ ( Beijing ) నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి సిద్ధమైంది. మరోవైపు అమెరికాతో సంబంధాల్ని పునరుద్ధరించుకునేందుకు కూడా టిక్‌టాక్ సంస్థ ప్రయత్నిస్తోంది.   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

కొత్తగా చోటుచేసుకుంటున్న ఈ వ్యవహారాలు టిక్‌టాక్ నిషేధంపై ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలిక. అమెజాన్ సంస్థ తీసుకున్న యూ టర్న్ను అమెరికా ప్రభుత్వం ( American Govt ) అవలంభిస్తుందా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

Trending News