Trump Warn to Iran: హర్మూజ్ జలసంధిలో నౌకలపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, మరే ఇతర ఆయుధంతో నౌకలపై దాడి చేసినా.. దానికి ప్రతీకారంగా ఆ దేశంలోని ఒక వంతెన, విద్యుత్ కేంద్రాన్ని పేల్చేస్తామని ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరించారు.
Iran Out Of Ceasefire: అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ యుద్ధం మళ్లీ మొదటికొచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. దీనిపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ ఉద్రిక్తతలు నెలకున్నాయి.
Iran Attacks on Hormuz Straight: హార్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు షిప్పింగ్ ట్యాంకర్లపై ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయ నావికుడు మరణించారు. మరో ఆరుగురు భారతీయులతో సహా ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలోని ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మొహమ్మద్ జవాద్ హొస్సేనీని పిలిపించి తీవ్ర నిరసనను తెలియజేసింది.
Iran America Conflicts: అంతం కాదది ఆరంభం అన్నట్టుగా ఇరాన్, అమెరికా యుద్ధం కొనసాగుతూనే ఉంది. మధ్యలో శాంతి చర్చలు అంటూ ఇరు దేశాలు సంతకాలు చేసినా.. అది క్షేత్ర స్థాయిలో వర్కౌట్ కావడం లేదు. మరోవైపు హార్మూజ్‌లో వెళ్లే నౌకలపై ఇరాన్ ఐఆర్జీసీ గార్డ్స్ కాల్పుల తర్వాత అమెరికా ప్రతి దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.
US Attacks Iran Infrastructure: పశ్చిమాసియా మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఖమేని అంత్యక్రియల వేళ ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ హార్మూజ్ గుండా వెళుతున్న నౌకలపై దాడులకు దిగడంతో ప్రతిగా అమెరికా ప్రతి దాడుల నిర్వహించింది. తాజాగా కీలకమైన హార్మూజ్‌లో వెళుతున్న వాణిజ్య ఓడపై ఐఆర్‌జీసీకి చెందిన దాడులు చేయడం.. ఆ వెంటనే అమెరికా ఎటాక్ చేయడం చకచకా జరిగిపోయయి. దీంతో హార్మూజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Iran America Mutual Attacks: పశ్చిమాసియాలో దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఒవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతుండగా..మరోవైపు అమెరికా ఇరాన్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. శాంతి ఒప్పందానికి స్వస్తి పలుకుతూ ఇరాన్‌పై దాడికి దిగింది అమెరికా. చర్చలతో తేలదని, బాంబులతోనే తేల్చుకుంటామని ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో మధ్య ఆసియా బాంబ్ దాడులతో మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసింది.
Khamenei Last Rights: కొద్ది గంటల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పార్ధివ దేహానికి అంత్య క్రియలు పూర్తి కానున్నున్నాయి. ఈ సమయంలో పశ్చిమాసియాలో మళ్లీ దాడులు మొదలయ్యాయి. అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్టే అమెరికా సైన్యం వైమానిక దాడులకు దిగింది. ఇరాన్ భూభాగంలోని వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా మళ్లీ దాడులు చేపట్టినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది.
MATA: మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ మహాసభలు అత్యంత ఘనంగా ముగిశాయి. అమెరికాలోని పెన్సిల్వేనియాలో రెండు రోజుల పాటు సాగిన ఈ మహాసభలు తెలుగు ఐక్యతకు సజీవ ప్రతీకగా నిలిచాయి. ప్రధాన మహాసభ మత సామరస్యానికి ప్రతీకగా ఇమామ్, క్రైస్తవ పాస్టర్, హిందూ పూజారి సంయుక్త ప్రార్థనలతో ప్రారంభమైంది.
Iran US:అమెరికా-ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన ఉన్నత స్థాయి శాంతి చర్చలు తాత్కాలికంగా ఆగిపోయాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడులు, హర్మూజ్ జలసంధి వివాదం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ చర్చల్లో తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది.
Iran US Hormuz: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించడంతో మళ్లీ ప్రపంచ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. అయితే ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరినా.. లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతూ ఉండటంతో ఇరాన్ .. ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
US Iran Deal:ఇరాన్–అమెరికా మధ్య అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగిన మరుసటిరోజే పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. దక్షిణ లెబనాన్‌లోని నబాతియే ప్రాంతంపై ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు జరిపాయి. ఈ దాడుల్లో 16 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.
Iran US Peace Talks: ఎట్టకేలకు ప్రపంచ ప్రజలు ఏదైతే కోరుకున్నారో అదే జరిగింది. దీర్ఘకాలం యుద్ధం వల్ల నష్టాలే తప్ప.. ఎలాంటి లాభం ఉండని అటు అమెరికాతో పాటు ఇటు ఇరాన్ కూడా అంగీకరించాయి. దీంతో కొన్ని రోజులుగా జరిగిన యుద్ధానికి ముగింపు పలికారు. ఇరు దేశాలు శాంతి ఒప్పందాలపై సంతకాలు చేయడంతో హార్మూజ్‌లో నౌకల ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.
Trump Modi Meeting: ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ-7 సదస్సు వేదికగా భారత్, అమెరికాల మధ్య అత్యంత కీలకమైన ద్వైపాక్షిక చర్చలకు రంగం సిద్ధమైంది. ఫ్రాన్స్‌లోని ఎవియాన్ నగరంలో జరుగుతున్న ఈ సదస్సు సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు.
America Iran Peace Talks: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం సద్దుమణిగింది. గత కొన్ని రోజులుగా బాంబుల వర్షంతో దద్దరిల్లిన యుద్ధభూమి కుదుటపడనుంది. తాజాగా ఇరాన్ అమెరికాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి డిజిటల్ సంతకాలు పూర్తి అయ్యాయని అమెరికా ప్రకటించింది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం పూర్తయ్యిందని, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి శుక్రవారం నుంచి పూర్తిగా తెరుచుకోనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా అయిన ట్రూత్‌లో వెల్లడించారు.
Iran US India: ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్దం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు రవాణాలో తీవ్ర అంతరాలు ఏర్పడింది. మరోవైపు భారత్ కూడా ఈ చమురు దిగుమతుల సంక్షోభం నేపథ్యంలో ప్రజలు పొదుపు మంత్రం పాటించాలని చెబుతుంది. అయితే ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం ఓ కొలిక్కి వచ్చినట్టు ట్రంప్ చెప్పిన కొన్ని గంటల్లోనే హార్మూజ్ జలసంధి దగ్గర ప్రయాణిస్తూన్న భారత చమురు ఓడలపై ఇరాన్ దాడికి తెగపడినట్టు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Trump Deal With Peace Deal: గురువారం రాత్రి ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బతీసేలా భీకర దాడులు చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కొద్ది గంటలకే ఇరాన్ తో యుద్దం విషయంలో కీలక ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు ఇరాన్ పై దాడుల్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ దేశ ఇరాన్‌తో చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని సంచలన ప్రకటన చేశారు.
Hormuz Strait Close:పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. తాజాగా ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేస్తోంది. దీంతో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ఈ మార్గంలో ప్రయాణించే అన్ని నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఎవరైనా అతిక్రమిస్తే నౌకలను కాల్చేస్తామని హెచ్చరించింది. హర్మూజ్‌ను దాటేందుకు ప్రయత్నించిన రెండు నౌకలపై దాడి కూడా చేసింది.
Iran US War: ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా వార్ మొదలై 100 రోజులు దాటినా.. ఇంకా పరిస్థితులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. ఓ వైపు అమెరికా, ఇరాన్‌లు సంధి కోసం ప్రయత్నిస్తూనే ఒకరిపై ఒకరు కవ్వించుకుంటున్నారు. తాజాగా హార్మూజ్ ప్రాంతంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ కూల్చివేసినందుకు ప్రతీకారంగా ఇరాన్‌లోని గగన్ రక్షణ వ్యవస్థలపై అమెరికా భీకర దాడులు నిర్వహించడంతో మధ్యాసియాలో మరోసారి ఉద్రిక్తలు నెలకొన్నాయి.
America Attacks on Iran: ఇరాన్ తో శాంతి చర్చల నేపథ్యంలో అమెరికా మరోసారి ఇరాన్ పై తీవ్రదాడులు చేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్‌తో చర్చలు హార్మూజ్ జలసంధి దిగ్భంధనం దగ్గరే ఆగిపోయాయి. తాజాగా బందర్ అబ్బాస్ సహా పలు ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలపై యూస్ వైమానిక దళం విరుచుకుపడింది.
US President Talks on strait of Hormuz: ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తత పరిస్థితులకు ఇంకా ఎండ్ కార్డ్ పడటం లేదు. శాంతి చర్చలు ఈ నేపథ్యంలో ఓ డీల్ కుదిరేవరకు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల దిగ్బంధం కొనసాగుతుందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు.
US-Iran Peace Talks:త్వరలో ఇరాన్‌తో ఒప్పందం కుదిరేందుకు అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. తన వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులు కోవడానికి అంగీకరించిందని తెలిపారు. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన అధికారులు వెల్లడించారు.
Tulsi Gabbard: అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ (DNI)గా పనిచేస్తున్న తులసి గబ్బార్డ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. తాను ఈ అత్యున్నత పదవికి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం వ్యక్తిగత కారణాలేనని పేర్కొన్నారు. తన భర్త అబ్రహాం అనారోగ్య సమస్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.