24 గంటల్లో 532 మంది మృతి.. లక్షకు చేరువలో కరోనా మరణాలు

ప్రపంచ దేశాలను అన్నింటినీ కలవరపెడుతోన్న అంశం కరోనా వైరస్ మహమ్మారి. రోజురోజుకూ కరోనా మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేవలం అగ్రరాజ్యం అమెరికాలో గత 24 గంటల్లో 532 కరోనా మరణాలు సంభవించాయి.

Last Updated : May 26, 2020, 09:11 AM IST
24 గంటల్లో 532 మంది మృతి.. లక్షకు చేరువలో కరోనా మరణాలు

ప్రపంచ దేశాలను అన్నింటినీ కలవరపెడుతోన్న అంశం కరోనా వైరస్ మహమ్మారి. రోజురోజుకూ కరోనా మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేవలం అగ్రరాజ్యం అమెరికాలో గత 24 గంటల్లో 532 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో కరోనా బారిన పడి అమెరికాలో చనిపోయిన వారి సంఖ్య దాదాపు లక్షకు చేరువైంది. తాజా మరణాలతో కలిపి అమెరికాలో ఇప్పటివరకూ 98,218 మంది కరోనాతో చనిపోయారు. బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

అగ్రరాజ్యంలో మొత్తం 16,62,375 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో చికిత్స తర్వాత 3.5 లక్షల మంది కోలుకుని పూర్తి ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయ్యారు. అయితే దేశంలో లక్ష వరకు మరణాలు సంభవించడం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. గత 24 గంటల్లో 2వేల వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు సమాచారం. కరోనా సంబంధిత వివరాలను జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ విడుదల చేస్తోంది. ఆల్‌టైమ్ గరిష్ట ధరలకు బంగారం ధరలు

పలు దేశాలు కరోనా మహమ్మారిని తరిమి కొట్టే వ్యాక్సిన్‌ను రూపొందించే పనిలో బిజీగా ఉన్నాయి. అయితే మరో 6 నెలల గడిస్తేగానీ కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి రాకపోవచ్చునని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్ వాడకం, అత్యవసరమైతే బయటకు వెళ్లాలని, అందులోనూ మాస్క్, వీలైతే ఫేస్ మాస్క్ ధరించాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్

Trending News