Andhra Pradesh: సెప్టెంబరు 5 నుంచి పాఠశాలల ప్రారంభం

కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి కారణంగా దేశమంతటా ఈ విద్యా సంవత్సరం ప్రారంభంపై సందిగ్ధం నెలకొంది. రోజురోజుకి కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు,  ఉపాధ్యాయుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.

Last Updated : Jul 22, 2020, 10:44 AM IST
Andhra Pradesh: సెప్టెంబరు 5 నుంచి పాఠశాలల ప్రారంభం

Reopen Schools in AP: అమరావతి: కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి కారణంగా దేశమంతటా ఈ విద్యా సంవత్సరం ప్రారంభంపై సందిగ్ధం నెలకొంది. రోజురోజుకి కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు,  ఉపాధ్యాయుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఇప్పటికే చాలా పరీక్షలను వాయిదా వేయగా.. మరికొన్నింటిని రద్దు చేసి పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) లో సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలను పునః ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ( Adimulapu Suresh ) తెలిపారు.  కొవిడ్‌–19 ( Covid-19 ) నిబంధనలను అనుసరిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సెప్టెంబర్‌ 5 నుంచి రాష్ట్రంలో పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. Also read: COVID19: భారత్‌లో 12 లక్షలకు చేరువలో కరోనా కేసులు

రాష్ట్రంలో మెరుగైన విద్య, విద్యార్థులకు నాణ్యమైన జగనన్న గోరుముద్ద ( jagananna gorumudda ) మధ్యాహ్న భోజన పథకంపై మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి (Y. S. Jaganmohan Reddy) క్యాంపు కార్యాలయంలో మంత్రి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. Also read: Telangana: మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా

రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు, ఇంగ్లీష్ మీడియం, మధ్యాహ్న భోజనం పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్ర స్థాయిలో రెండు డైరెక్టర్ స్థాయి పోస్టులను, జిల్లాకు ఒక జాయింట్ డైరెక్టర్ పోస్టులను ఏర్పాటుచేయాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించినట్లు మంత్రి వివరించారు.  ఆన్‌లైన్లో పాఠశాలలకు అనుమతులు, గుర్తింపు పత్రాలు జారీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతోపాటు ప్రతీఏటా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అకడమిక్ ఆడిటింగ్ నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్ పేర్కొన్నారు. Also read: Covid-19: కోవ్యాక్సిన్ వలంటీర్ల డిశ్చార్జ్

Trending News