coronavirus: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ (coronavirus) నానాటికీ విజృంభిస్తూనే ఉంది. సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ( Kadiyam Srihari ) కి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
ఆయనతోపాటు డ్రైవర్, పీఏ, గన్‌మెన్‌కు పరీక్షలు చేయగా.. వారికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే శ్రీహరి హోం క్వారంటైన్లో ఉన్నారు. ఆయన సిబ్బందిని కోవిడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. Also read: హైకోర్టు అడిగిన వివరాలు ఇవ్వండి: CM KCR
గతకొన్ని రోజుల క్రితం నుంచి తెలంగాణ ( Telangana ) లో పలువురు ఎమ్మెల్యేలకు, హోం మంత్రికి కూడా కరోనా సోకింది. కొంతమంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా.. మరికొంత మంది చికిత్స పొందుతున్నారు. దీంతో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. Also read: Political Science: వేర్పాటువాదం చాప్టర్‌ను తొలగించిన NCERT