AP Pensions Issue: పింఛన్ల పంపిణీపై హైకోర్టులో పిటీషన్

AP Pensions Issue: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీపై మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాజకీయ దుమారం రేపుతున్న పింఛన్ల వ్యవహారంపై ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 3, 2024, 09:25 AM IST
AP Pensions Issue: పింఛన్ల పంపిణీపై హైకోర్టులో పిటీషన్

AP Pensions Issue: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ ఎన్నికల కమీషన్ వాలంటీర్లను విధుల నుంచి తప్పించడంతో పింఛన్ల పంపిణీ వ్యవహారంపై దుమారం రేగుతోంది. పెన్షన్లు, సంక్షేమ పథకాల్ని కోడ్ అమల్లో ఉన్నంతవరకూ వాలంటీరు చేపట్టకూడదనేది ఎన్నికల సంఘం ఆదేశాలు. దాంతో పింఛన్లు ఇంటింటికీ చేరలేని పరిస్థితి నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ విషయమై దుమారం రేగుతుంటే..మరోవైపు ఎన్నికల సంఘం ఆదేశాల్ని సవాలు చేస్తూ ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. 

వాలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి తప్పిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలకు సవాలు చేస్తూ గుంటూరుకు చెందిన ఓ మహిళ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇంటింటికీ పింఛన్లు అందించేలా ఆదేశాలివ్వాలని పిటీషనర్ కోరారు. వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్లు ఇవ్వకపోతే తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని పిటీషనర్ తెలిపింది. ఈ పిటీషన్‌ను హైకోర్టు స్వీకరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ పిటీషన్‌పై విచారణ జరిగితే ఎలాంటి తీర్పు వెలువడనుందనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఈ అంశంపై ఇప్పటికే రాజకీయ దుమారం రేగుతోంది. తెలుగుదేశం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. 

మరోవైపు పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కొన్ని విధి విధానాలు జారీ చేసింది. ఏప్రిల్ 3 అంటే ఇవాళ్టి నుంచి 6వ తేదీవరకూ నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ జరుగుతుందని తెలిపింది. వృద్ధులు, నడవలేనివాళ్లు, అనారోగ్యంతో బాధపడేవారికి మాత్రం సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటికే పింఛన్లు అందిస్తామన్నారు.

Also read: AP Politics: టీడీపీకి గుబులు పుట్టిస్తోన్న జనసేన గాజు గ్లాసు గుర్తు.. ఎందుకో తెలుసా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News