AP Politics: పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసు. కానీ ఎన్నికల కమిషన్ మాత్రం గత ఎన్నికల్లో ఆ పార్టీకి పోలైన ఓట్ల శాతం కారణంగా ఆ గుర్తును కేటాయించలేకపోయింది. కానీ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ పోటీ చేసే స్థానాల్లో మాత్రం గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. అది కూడా ఫ్రీ సింబల్ గా కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఓ గుర్తును ఫ్రీ సింబల్ అంటే .. ఆ పార్టీ పోటీ చేసే స్థానాల్లో మాత్రమే గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తారు. కానీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఆ గుర్తు ఎవరైనా కోరుకుంటే మాత్రం వారికీ ఎన్నికల సంఘం ఆ గుర్తును కేటాయిస్తోంది. ఇదే ఇపుడు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి గుబులు పుట్టిస్తోంది. జనసేన గాజు గ్లాసు గుర్తు మాస్‌లో బాగానే వెళ్లిపోయింది. ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో ఎవరైన ఇండిపెండెంట్ అభ్యర్థులు ఆ గుర్తుపై పోటీ చేసే అవకాశాలున్నాయి. ఒకవేళ స్వతంత్ర్య అభ్యర్ధులు ఆ గుర్తును కోరుకుంటే ఏపీలో ఉమ్మడిగా పోటీ చేస్తోన్న భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కూటమి నేతలకు తిప్పలు తప్పవని చెప్పాలి. జనసేన పోటీ చేయని స్థానాల్లో ఇండిపెండెట్లు గాజు గాజు గుర్తుపై పోటీ చేస్తే జనసేన పార్టీ ఓట్లు అటు షిప్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. దీంతో కూటమి నేతలు గాబరా పడుతున్నారు.
మరోవైపు ఎన్నికల సంఘంతో జనసేన నేతలు తెలంగాణలో మాదిరి ఇక్కడ కూడా గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయినా.. ఎవరికీ కేటాయించకూడదని రిక్వెస్టకు... అపుడు తెలంగాణలో ఈ గుర్తు ఫ్రీ సింబల్ అయినా.. ఎవరికీ కేటాయించబడలేదు. తాజాగా ఏపీలో కూడా జనసేన పోటీ చేయని స్థానంలో ఈ గుర్తును ఎవరికీ కేటాయించబడటం లేదని ఎన్నికల సంఘం ఓ లేఖను విడుదల చేసింది. దీంతో కూటమి నేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ, తెలుగు దేశం, జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ ఆరు లోక్‌సభ స్థానాలు, 10 అసెంబ్లీ సీట్లకు పోటీకి దిగుతోంది. అటు జనసేన రెండు లోకసభ సీట్లతో పాటు.. 21 అసెంబ్లీ సీట్లకు పోటీకి దిగుతుంది. టీడీపీ మాత్రం 17 లోక్‌సభ సీట్లతో పాటు మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి దిగుతోంది. అటు అధికార వైయస్‌ఆర్సీపీ మాత్రం 175 అసెంబ్లీతో పాటు 25 లోక్‌సభకు ఒంటరిగానే బరిలో దిగుతోంది. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అటు ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు తెలంగాణలో మే 13న నాల్గో విడుతలో ఎన్నికల జరగనున్నాయి. ఇక జూన్ 2న చివరి విడత ఎన్నికలు జరగుతాయి. ఆ తర్వాత జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్: కేటీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
AP Politics: టీడీపీకి గుబులు పుట్టిస్తోన్న జనసేన గాజు గ్లాసు గుర్తు.. ఎందుకో తెలుసా..