ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమౌతున్నాయి. పదిరోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వ పథకాలపై సమగ్ర చర్చతో పాటు పలు ప్రజా సమస్యలు సభలో చర్చకు రానున్నాయి. కాగా. ప్రతిపక్ష పార్టీ వైసీపీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రతిపక్షం లేకుండా ఈ సారి సమావేశాలు జరగనున్నాయి. టీడీపీ సభ్యులుతో పాటు మిత్రపక్షమైన బీజేపీ సభ్యులు మాత్రమే సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రతిపక్షాలు లేకపోవడం సభకు ఎలాంటి అంతరాలు లేకుండా జరగనున్నాయి. 

Last Updated : Nov 10, 2017, 10:36 AM IST
ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమౌతున్నాయి. పదిరోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వ పథకాలపై సమగ్ర చర్చతో పాటు పలు ప్రజా సమస్యలు సభలో చర్చకు రానున్నాయి. కాగా. ప్రతిపక్ష పార్టీ వైసీపీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రతిపక్షం లేకుండా ఈ సారి సమావేశాలు జరగనున్నాయి. టీడీపీ సభ్యులుతో పాటు మిత్రపక్షమైన బీజేపీ సభ్యులు మాత్రమే సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రతిపక్షాలు లేకపోవడంతో  ఎలాంటి అంతరాలు లేకుండా సభ జరగనుంది. 

ప్రశ్నోత్తరాల్లో భాగంగా రోజుకు పది ప్రశలు చొప్పున ..పది రోజు రోజుల పాటు జరిగే సభలో మొత్తం100 ప్రశ్నలు ముందుకురానున్నాయి. కాగా మండలి సమావేశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఉభయ సభల్లో మొత్తం 200 ప్రశ్నలు వస్తాయి. కాగా ఈ సారి సభలో ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ పథకాలపై సమగ్రంగా చర్చించనున్నారు. రైతు రుణమాఫీ, నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, , వ్యవసాయ అనుబంధరంగాలు, డ్వాక్రా రుణ మాఫీ, విద్యార్ధుల ఆత్మహత్యలు తదితర అంశాలు సభలో చర్చకురానున్నాయి.

Trending News