ప్రాంతీయ పార్టీలపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా సంచలన వ్యాఖ్యలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దాడి ఘటనపై ఏపీ పీసీసీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు  

Last Updated : May 15, 2019, 03:31 PM IST
ప్రాంతీయ పార్టీలపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా సంచలన వ్యాఖ్యలు

ప్రాంతీయ పార్టీల తీరుపై ఏపీ పీసీసీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  రాష్ట్రాలను ప్రాంతీయ పార్టీలు తమ సొంత జాగీరుగా భావిస్తున్నాయని .. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంపై గుత్తాధిపత్యం తమదే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలుప్రజాస్వామ్యాంలో మంచిది కాదని కన్నా లక్ష్మీనారాయణ హితవు పలికారు.

అమిత్ షాపై రాళ్ల దాడి ప్రస్తావన
పశ్చిగ బెంగాల్  ఎన్నికల ప్రచారంలో  చీఫ్ అమిత్‌ షాపై జరిగిన దాడికి నిరసనగా బీజేపీ దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన కన్నా లక్ష్మీణారాయణ..తమ పార్టీ చీఫ్ అమిత్‌ షాపై రాళ్ల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అమిత్ షాపై దాడి ఘటనను ప్రస్తావిస్తూ ప్రాంతీయ పార్టీలపై తీరుపై కన్నా ఈ మేరకు స్పందించారు

దీదీ అరెస్ట్ కు కన్నా డిమాండ్...
ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ మమతా బెనర్జీ   హింసాత్మక చర్యలకు పాల్పడడం ద్వారా విజయం సాధించాలని చూస్తున్నారు..  ఆమె తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఉందా ?  అన్న సందేహాలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షాపై రాళ్ల దాడికి బాధ్యురాలైన మమతపై  ఈసీ చర్యలు తీసుకోవాలని ....వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలని కన్నా లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

Trending News