AP Cabinet Decisions: జనవరి 1 నుంచి పెన్షన్ పెంపు, ఇకపై 2750 రూపాయలు, కేబినెట్ నిర్ణయాలివే

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పెన్షన్‌దారులకు శుభవార్త విన్పించింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 13, 2022, 04:20 PM IST
AP Cabinet Decisions: జనవరి 1 నుంచి పెన్షన్ పెంపు, ఇకపై 2750 రూపాయలు, కేబినెట్ నిర్ణయాలివే

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెన్షన్ పెంపు, వైఎస్సార్ పశుభీమా పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ క్లాస్‌లు వంటి కీలకమైన అంశాలకు కేబినెట్ ఆమోదించింది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీకు తగ్గట్టే ఏపీ ముఖ్యమంత్రి ప్రతియేటా పెన్షన్ పెంచుతున్నారు. 2023 జనవరి నుంచి పెన్షన్‌ను 2500 నుంచి 2750 చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే జనవరి 1 నుంచి కొత్త పెన్షన్ 2750 రూపాయలు అమలు కానుంది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 62.31 లక్షలమంది పెన్షన్‌దారులకు ప్రయోజనం కలగనుంది. 

మరోవైపు వైఎస్సార్ పశుభీమా పథకం ప్రతిపాదనకు కేబినెట్ అనుమతించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ క్లాస్‌లు, ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్‌టీవీ రూమ్‌లను నాడు నేడులో నిర్మించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఏపీలో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూముల రీసర్వే నిమిత్తం మున్సిపాలిటీ చట్ట సవరణ, బాపట్ల-పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినమైన డిసెంబర్ 21న 5 లక్షల ట్యాబ్‌ల పంపిణీకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 8వ తరగతి విద్యార్ధులకు ఈ ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. మరోవైపు కడప జిల్లాలో జిందాల్ స్టీల్ భాగస్వామిగా తలపెట్టనున్న స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం లభించింది. దీనికితోడు ఏపీ జ్యుడీషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకు ఆమోదం లభించింది. 

Also read: Ap Secretariat System: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News