Ap Secretariat System: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త

Ordinance Issued For Security Secretariat System: సచివాలయ ఉద్యోగుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు కొత్తగా చట్టం తీసుకుస్తూ.. ఆర్డినెన్స్ చేసింది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టనుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2022, 08:21 AM IST
Ap Secretariat System: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త

Ordinance Issued For Security Secretariat System: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు కొత్తగా చట్టం తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సబంధించిన ఆర్డినెన్స్‌ను జారీ చేసిటనట్లు వెల్లడించింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం, ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌ చట్టం తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కూడా ప్రత్యేక చట్టం రూపంలోకి వచ్చింది. రాజ్యాంగంలోని 11, 12 షెడ్యూల్ ప్రకారం.. చట్టం ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్లు ప్రభుత్వం ఆర్డినెన్స్‌లో పేర్కొంది.

సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే.. గ్రామ, సచివాలయ వ్యవస్థపై దృష్టిపెట్టారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి మండల కేంద్రాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. ఇక నివాసం ఉంటున్న గ్రామంలోనే పరిష్కరం అయ్యేలా ఈ వ్యవస్థను తీసుకువచ్చారు. 2 అక్టోబర్‌ 2019 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. కొత్తగా 1.34 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టి.. ఒక్కో సచివాలయానికి 10 నుంచి`11 మంది ఉద్యోగులను ఏర్పాటు చేసింది. కేవలం నాలుగు నెలల్లోనే ఈ ఉద్యోగ నియమాకాలు చేపట్టడం విశేషం. ప్రస్తుతం ఈ సచివాయాలు సూపర్ సక్సెస్‌తో రన్ అవుతున్నాయి. వీటి ద్వారా 545 రకాల సేవలను ప్రజలు తమ సొంత గ్రామాల్లోనే పొందుతున్నారు. 

తాజాగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు సబంధించి చట్టాన్ని తీసుకువస్తూ ఆర్ధినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టనుంది. సభ్యుల ఆమోదంతో చట్ట రూపం దాల్చనుంది. దీంతో సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇటీవలె గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే అర్హులైన ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. వారి జీతాలు పెంచడంతోపాటు.. ఉద్యోగులను ఈహెచ్‌ఎస్‌ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అర్హులైన వారికి ఆరోగ్యశ్రీ ట్రస్టు ఆధ్వర్యంలో ఈహెచ్‌ఎస్‌ కార్డుల జారీ చేసేందుకు రెడీ అవుతోంది. అదేవిధంగా ప్రొబేషన్ సమయంలో విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగి కుటుంబాలకు కారుణ్య నియామకాలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చనిపోయిన ఉద్యోగి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నారు. 

Also Read: Golden GLobe 2023 : గోల్డెన్ గ్లోబ్‌ నామినేషన్‌ లిస్ట్‌లో నాటు నాటు.. కీరవాణికి అంతర్జాతీయ అవార్డు రానుందా?

Also Read: Nagababu : జబర్దస్త్ రోజుల నాటి ఫోటోను షేర్ చేసిన నాగబాబు.. గెటప్ శ్రీను కోసం స్పెషల్ పోస్ట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News