AP Early Polls: ఏపీలో ముందస్తు ఎన్నికలు, క్లారిటీ ఇచ్చేసిన వైఎస్ జగన్

AP Early Polls: ఏపీలో గత కొద్దికాలంగా ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనల నేపధ్యంలో ప్రచారం మరింత అధికమైంది. ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో కూడా ఇదే అంశం ప్రస్తావనకు వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 12, 2023, 09:21 PM IST
AP Early Polls: ఏపీలో ముందస్తు ఎన్నికలు, క్లారిటీ ఇచ్చేసిన వైఎస్ జగన్

AP Early Polls: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకు ముందస్తు ఎన్నికలుంటాయా లేదా అనే విషయంపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. వైసీపీ నేతలు ఇటీవల ఈ అంశంపై వివరణ ఇచ్చినా ప్రచారం ఆగలేదు. అయితే ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చేశారు.

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులతో సమావేశమై పలు కీలకమైన అంశాల్లో దిశానిర్దేశం చేశారు. గత కొద్దిరోజులుగా ఏపీలో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారం కేబినెట్ అనంతర సమావేశంలో విన్పించింది. రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం గురించి మంత్రులు నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకూ ఈ అంశంపై వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, మిధున్ రెడ్డి తదతరులు స్పందించారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి మంత్రులు ముందస్తు ఎన్నికల అంశాన్ని తీసుకెళ్లడంతో వైఎస్ జగన్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేశారు. ముందస్తు ఎన్నికలున్నాయా లేవా అనేది తేల్చేశారు. 

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోవద్దని వైఎస్ జగన్ సూచించారు. ఆ ప్రచారాలన్నీ వదిలేసి వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మిగిలిన అన్ని విషయాలన్ని తనకు వదిలేయమని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంటూ ఎన్నికలకు సన్నద్ధం కావాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఎన్నికల సమయం అయినందున సదా ప్రజల్లోనే ఉండాలని సూచించారు. గడప గడపకు, జగనన్న సురక్ష కార్యక్రమాలపైనే ఫోకస్ పెట్టాలని, ఇతరత్రా అంశాల్ని పట్టించుకోవద్దన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల ట్రాప్‌లో పడకుండా తమ వ్యూహంతో ముందుకెళితే చాలనేది వైఎస్ జగన్ ఆలోచనగా ఉంది. ఇదే విషయాన్ని మంత్రులకు ఆయన స్పష్టం చేశారు. 

మరోవైపు జగనన్న సురక్ష కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశంసించారు. ప్రజలకు అవసరమైన సర్టిఫికేట్లు అక్కడికక్కడే ఇస్తూ ఏ విధమైన ఇబ్బందుల్లేకుండా చూస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కితాబిచ్చారు. గడప గడపకు కార్యక్రమాన్ని మరింత మెరుగ్గా కొనసాగించాలని తెలిపారు.

Also read: AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, అసైన్డ్ భూములకు హక్కులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News