AP Cabinet: ఏపీలో కొత్త మెడికల్ కళాశాలలు, పోలవరం ప్రాజెక్టు, ఆర్ 5 జోన్ తదితర అంశాల్లో ఏపీ కేబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఏళ్ల తరబడి సమస్యగా మారిన అసైన్డ్ భూముల విషయంలో అతి ముఖ్యమైన నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. కొన్ని కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూములపై కీలక నిర్ణయమైంది. కేబినెట్ భేటీ దాదాపు నాలుగు గంటలసేపు జరిగింది. జూలై నెలలో అమలు కావల్సిన పలు సంక్షేమ పధకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జగనన్న తోడు ఈ నెల 18 వతేదీన, నేతన్న నేస్తం ఈ నెల 21వ తేదీన అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. సీఆర్డీఏ పరిధిలోని ఇళ్ల నిర్మాణం పనుల్ని జూలై 24వ తేదీ ప్రారంభించనున్నారు. సున్న వడ్డీ కింద 1350 కోట్ల రూపాయలు, జగనన్న విదేశీ విద్య వంటి పథకాలకు ఆమోదముద్ర లభించింది.
అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్రంలోని నిరుపేదలకు అసైన్డ్ భూములపై ఉన్న ఆంక్షల్ని కేబినెట్ తొలగించింది. 54 వేల అసైన్డ్ భూములు, 9 వేల 62 ఎకరాల లంక భూముల్ని రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవం విశేషం. అదే విధంగా దళిత వర్గాలకు కేబినెట్ భేటీలో వరాలు కురిపించారు. యూనివర్శిటీల్లో ఉద్యోగ విరమణ వయస్సును 63 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఏపీలోని 5 కొత్త మెడికల్ కళాశాలల్లో 706 పోస్టులు, 480 బోధనా పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పోలవరం ప్రాజెక్టు పునరావాసం కోసం ప్రత్యేక ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. 8104 కోట్ల పెట్టుబడిలో ఏర్పాటు కానున్న జిందాల్ న్యూ ఎనర్జీ ప్లాంట్, 1500 మెగావాట్ల సామర్ధ్యంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ప్రభుత్వ ఆధీనంలోని దేవాలయాల్లో అర్చకులకు ఉద్యోగ విరమణ లేకుండా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదించింది.
సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసిన అనంతరం మంత్రులతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. మరో 9 నెలల్లో జరిగే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు..
Also read: Heavy Rains: ఏపీలో ఇవాళ్టి నుంచి మూడ్రోజులు వర్షాలు, హైదరాబాద్‌లో భారీ వర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook