Visakha Metro Project: విశాఖపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి, 2024 ఎన్నికల్లోగా విశాఖ మెట్రో ప్రాజెక్ట్ శంకుస్థాపన

Visakha Metro Project: ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం సిద్ధమౌతోంది. కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై స్పష్టత వచ్చేంతవరకూ అభివృద్ధిపై దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 25, 2023, 10:33 AM IST
Visakha Metro Project: విశాఖపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి, 2024 ఎన్నికల్లోగా విశాఖ మెట్రో ప్రాజెక్ట్ శంకుస్థాపన

Visakha Metro Project: ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ప్రకటన త్వరలో ఉంటుందనేది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనగా ఉంది. అన్ని హామీల్ని అమలు చేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశాన్ని సవాలుగా తీసుకున్నారు. కోర్టు సమస్యల్ని అధిగమించి విశాఖను త్వరలోనే ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించవచ్చు.

ఏపీ ప్రభుత్వం గత కొద్దికాలంగా అన్నింటికీ విశాఖపట్నంకే ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు, జీ 20 సన్నాహక సదస్సు ఇలా ముఖ్యమైన ఈవెంట్లతో పాటు భారీ పెట్టుబడుల్ని విశాఖకు తరలిస్తోంది. విశాఖపట్నంను ఒక మెట్రో పాలిటన్ సిటీగా మార్చే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సాగర తీర నగర అభివృద్ధికి దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలమేరకు ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి విశాఖపట్నంలో ఓ సమీక్షా సమావేశాన్ని సైతం నిర్వహించారు. 

ఈ చర్యల్లో భాగంగా విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. 2024 జనవరి నాటికి టెక్నికల్ అంశాలతో నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. అంటే 2024 ఎన్నికలకు వెళ్లేలోగా విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. విశాఖకు మెట్రో వస్తే అది అభివృద్ధికి ఓ చోదకశక్తి కానుంది. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుతో పాటు నేషనల్ హిస్టరీ మ్యూజియం, సిగ్నేచర్ టవర్స్, కన్వెన్షన్ సెంటర్, కైలాసగిరి సైన్స్ సిటీ, భీమిలి రోడ్‌లో వాటర్ పార్క్, కళావాణి ఇండోర్ స్డేడియం నిర్మాణ పనుల ప్రారంభానికి ఛీప్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.

నాలుగు దశల్లో విశాఖ మెట్రో

విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశను గాజువాక నుంచి కొమ్మాది వరకూ, రెండవ దశను గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకూ, మూడవ దశను తాటిచెట్లపాలెం నుంచి చిన్న వాల్తేరు వరకూ, నాలుగవ దశను కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ వరకూ చేపట్టనున్నారు.

Also read: MLA Mekapati Chandrasekhar Reddy: ఆస్తి పంపకాల్లో అన్యాయం చేశారు.. ఉదయగిరి ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News