MLA Mekapati Chandrasekhar Reddy: ఆస్తి పంపకాల్లో అన్యాయం చేశారు.. ఉదయగిరి ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

Mekapati Chandrasekhar Reddy Comments: ఆస్తి పంపకాల్లో తనకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అన్న రాజమోహన్ రెడ్డి, తమ్ముడు రాజారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 24, 2023, 08:06 PM IST
MLA Mekapati Chandrasekhar Reddy: ఆస్తి పంపకాల్లో అన్యాయం చేశారు.. ఉదయగిరి ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

Mekapati Chandrasekhar Reddy Comments: నెల్లూరు జిల్లా మర్రిపాడులోని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడైన ఉదయగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ రాజారెడ్డి ఓ ఛానల్ లో తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తన అన్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, తమ్ముడు రాజారెడ్డి కలిసి ఆస్తి పంపకాల్లో తనకు అన్యాయం చేశారని రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఆస్తిలో తనకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఆస్తి ఇచ్చినట్లు చెప్పడంపై  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యులపై విమర్శలు గుప్పించారు.

ఉదయగిరి నియోజకవర్గానికి వైసీపీకి ఇంఛార్జి గతిలేక మూడు నెలల తర్వాత రాజారెడ్డిని పెట్టుకుందన్నారు చంద్రశేఖర్ రెడ్డి. తన అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పిన విధంగా ఆస్తులు ఇప్పటికీ పంపిణీ చేయలేదని తెలిపారు. రాజారెడ్డి ఇంచార్జి అవ్వగానే ఎమ్మెల్యే అయినట్లు ఫీల్ అయిపోతున్నాడని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున రాజారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో లేదో కూడా నమ్మకం లేని పరిస్థితి నెలకొందన్నారు. తాను ఈ స్థితిలో ఉండడానికి కారణం రాజారెడ్డి అని ఆయన విమర్శించారు. తన మొదటి భార్య బిడ్డలను  దూరం చేసి ఆస్తి పంచకుండా చేసి అన్యాయం చేసిన పరమ దరిద్రులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లికి భిక్షం పెట్టని  మీరు నియోజకవర్గ ప్రజలకు ఏమి మేలు చేస్తారని ప్రశ్నించారు..

తన భార్య  శాంతమ్మని దుష్టశక్తి అని అంటే.. మీ భార్యలు కూడా దుష్టశక్తులే అవుతారంటూ ఫైర్ అయ్యారు. కత్తులు, గొడ్డళ్లు తీసుకుని తాను పోరాటం చేస్తేనే.. మీకు రాజకీయ భవిష్యత్ వచ్చిందని చంద్రశేఖర్ రెడ్డి చెప్పుకొచ్చారు. తన భార్య శాంతమ్మ మాట విని ఉంటే రాజారెడ్డి ఉదయగిరిలో రాజకీయం చేసే వాడే కాదని అన్నారు. న్యాయంగా ఆస్తి ఇవ్వకపోతే కోర్టుకెళ్లిన సాధించుకుంటానని ఆయన సవాల్ చేశారు.

కాగా.. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేశారని ఆయనను వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఆయన ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. 

Also Read: Vande Bharat Express: ఒక్క రోజులో బెంగుళూరుకు వెళ్లి రావొచ్చు.. 'వందే భారత్' ప్రారంభోత్సవంలో కిషన్ రెడ్డి      

Also Read: Snake Bite: ఒకే కుటుంబంలో ముగ్గురిని కాటు వేసిన పాము.. ఇద్దరు మృతి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News