Amma Vodi scheme: అమ్మ ఒడి పథకం రేపే..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం

Amma Vodi scheme: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి పథకం రెండో విడత రేపు ప్రారంభమవడం ఖాయమైంది. ఎన్నికల కోడ్ నేపధ్యంలో ప్రశ్నార్ధకంగా మారిన పథకంపై క్లారిటీ వచ్చింది.

Last Updated : Jan 10, 2021, 11:42 PM IST
  • అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమం రేపు సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం
  • 44 లక్షల 48 వేల 865 తల్లుల ఖాతాల్లో..6 వేల 673 కోట్లు జమ
  • ఎన్నికల కోడ్ కారణంగా ఏర్పడిన సందేహాల్ని క్లియర్ చేసిన ప్రభుత్వం
Amma Vodi scheme: అమ్మ ఒడి పథకం రేపే..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభం

Amma Vodi scheme: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన అమ్మఒడి పథకం రెండో విడత రేపు ప్రారంభమవడం ఖాయమైంది. ఎన్నికల కోడ్ నేపధ్యంలో ప్రశ్నార్ధకంగా మారిన పథకంపై క్లారిటీ వచ్చింది.

ఏపీ ( AP ) లో అమ్మఒడి ( Amma vodi scheme ) రెండో విడత నగదు పంపిణీ కార్యక్రమాన్ని రేపు అంటే జనవరి 11వ తేదీన నెల్లూరు నుంచి ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) చేతుల మీదుగా తలపెట్టిన కార్యక్రమం ఎన్నికల కోడ్ ( Election code ) కారణంగా ప్రశ్నార్ధకమైంది. జనవరి 8వ తేదీ రాత్రి హఠాత్తుగా ఏకపక్షంగా ఎన్నికల కమీషన్ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

Also read: AP: నిమ్మగడ్డ నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయి

షెడ్యూల్ విడుదల చేస్తూనే..దాంతోపాటు సంక్షేమ పథకాల్ని( Welfare schemes ) నిలిపివేయాలంటూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Nimmagadda Ramesh kumar ) మరో ఉత్తర్వులు జారీ చేయడంతో అమ్మఒడి పథకం అమలవుతుందా లేదా అనే సందేహం ఏర్పడింది. ఈ నేపధ్యంలో అటు ప్రభుత్వం..ఇటు మంత్రులు క్లారిటీ ఇచ్చారు. పథకం ముందు అనుకున్నట్టుగానే ప్రారంభం కానుందని ప్రకటించారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. 

జనవరి 11 ఉదయం అంటే రేపు ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11.10 గంటకు నెల్లూరు ( Nellore ) పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 11.30 గంటలకు నెల్లూరు శ్రీ వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో అమ్మఒడి పథకం రెండో ఏడాది కార్యక్రమాన్ని ప్రారంభించి..బహిరంగసభలో మాట్లాడనున్నారు. ఇందులో భాగంగా 44 లక్షల 48 వేల 865 తల్లుల ఖాతాల్లో 6 వేల 673 కోట్ల రూపాయలు జమ కానున్నాయి.

Also read: AP: నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం..అమ్మ ఒడి పరిస్థితేంటి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News