AP: నిమ్మగడ్డ నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయి

ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై విమర్శల ధాటి పెరుగుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్  నిర్ణయాలున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.

Last Updated : Jan 10, 2021, 08:16 PM IST
AP: నిమ్మగడ్డ నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయి

ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై విమర్శల ధాటి పెరుగుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్  నిర్ణయాలున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.

ఏకపక్షంగా పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో మరోసారి ప్రభుత్వంతో పేచీ పెట్టుకున్న ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Election commissioner Nimmagadda Ramesh kumar ) పై అధికార పార్టీ నేతలు ఒక్కొక్కరిగా విమర్శలు ఎక్కుపెట్టారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంపై మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa satyanarayana ) స్పందించారు. రాజ్యాంగస్పూర్తిని దెబ్బతీసేలా ఎన్నికల కమీషనర్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 

కరోనా వైరస్ ( Corona virus ) సంక్రమణ పరిస్థితుల్లో ఎన్నికలు ఎందుకు పెట్టాలనుకుంటున్నారో అర్ధం కావడం లేదన్నారు. అధికారంతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని మర్చిపోకూడదన్నారు. జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ఉంటుందని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్నికలు నిర్వహించలేమని ఛీఫ్ సెక్రటరీ చెప్పిన గంటలోనే షెడ్యూల్ ( Election Schedule ) విడుదల చేయడం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమేననన్నారు మంత్రి బొత్స.

నిజంగానే ఎన్నికలపై చిత్తశుద్ధి ఉంటే 2018లో ఎందుకు పెట్టలేదని..ఏపీలో 30 కేసులు కూడా లేనప్పుడు ఏకపక్షంగా ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కాదని ఎన్నికలు నిర్వహించాలని చూడటం తానెక్కడా చూడలేదన్నారు. ఎవరి స్వార్ధ ప్రయోజనాల కోసం ఎస్ఈసీ పనిచేస్తుందో అర్దం కావడం లేదని మండిపడ్డారు. ఎస్ఈసీ ఓ రాజకీయపార్టీలా వ్యవహరిస్తుందని ఆరోపించారు

Also read: AP: నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు టీడీపీ నేతల సన్మానాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News