Medical Colleges: ఏపీలో రెండేళ్లలో మరో 12 వైద్య కళాశాలలు, వచ్చే ఏడాది నుంచి కొత్తగా 850 మెడికల్ సీట్లు

Medical Colleges: ఏపీలో వైద్య విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుతో రాష్ట్రంలో వైద్య విద్యావకాశాలు పెరుగుతున్నాయి. మరోవైపు కొత్తగా 850 వైద్య విద్య సీట్లు అందుబాటులో తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 12, 2023, 08:01 AM IST
Medical Colleges: ఏపీలో రెండేళ్లలో మరో 12 వైద్య కళాశాలలు, వచ్చే ఏడాది నుంచి కొత్తగా 850 మెడికల్ సీట్లు

Medical Colleges: ఏపీలో వైద్య విద్యావకాశాలు మెరుగుపర్చే ప్రక్రియలో భాగంగా కొత్తగా 17 వైద్య కళాశాలలు ఏర్పటవుతున్నాయి. ఇప్పటికే ఐదు వైద్య కళాశాలలు ప్రారంభం కాగా మరో 12 వైద్య కళాశాలల్ని రానున్న రెండేళ్లలో ప్రారంభించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నేషనల్ మెడికల్ కమీషన్‌కు దరఖాస్తు చేసుకుంది ప్రభుత్వం. 

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు ఓ వైద్య కళాశాల ఉండేలా ప్రణాళికలు రచించింది. 8,480 కోట్ల ఖర్చుతో ఈ కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. 17 వైద్య కళాశాలల ద్వారా 2,550 వైద్య సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కొత్త వైద్య కళాశాల ప్రారంభంతో 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక 2024-25 వద్యా సంవత్సరం నుంచి పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె వైద్య కళాశాలల్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇక్కడున్న వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్ని బోధనాసుపత్రులుగా అభివృద్ధి చేసింది. ఇప్పటికే ఈ కళాశాలల్లో 750 సీట్ల మంజూరుకు నేషనల్ మెడికల్ కమీషన్‌కు దరఖాస్తు చేసింది ప్రభుత్వం. 

ఇక 2025-26 విద్యా సంవత్సరం నుంచి మరో ఏడు వైద్య కళాశాలలు ప్రారంభించనుంది. ఇవి కాకుండా ఇప్పటికే అందుబాటులో ఉన్న అనంతపురం మెడికల్ కళాశాలలో 50, నెల్లూరులో 25, శ్రీకాకుళంలో 25 అంటే మరో వంద సీట్ల పెంపుకు ఎన్ఎంసీకు దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. ఇందుకు అనుగుణంగా బెడ్స్, వైద్య సిబ్బంది, ఇతర సదుపాయాలు ఉండటంతో ఎన్ఎంసీ ఇన్‌స్పెక్షన్‌లో ఇబ్బంది ఎదురుకాకపోవచ్చు. వైద్య విద్యకు ఇప్పుడు ఇస్తున్నంత ప్రాధాన్యత గతంలో ఎప్పుడూ లేదు. వైద్య విద్య పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యత ఇస్తోంది. రానున్న రెండేళ్లలో 12 వైద్య కళాశాలలు ప్రారంభమైతే కొత్తగా 18 వందల మెడికల్ సీట్లు అందుబాటులో రానున్నాయి. 

Also read: Ysr Congress Party: వైసీపీలో కఠిన నిర్ణయాలు, 11 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీల మార్పు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News