Ysr Congress Party: మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. టార్గెట్ 175 లక్ష్యం పెట్టుకున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఎన్నికల సమీపిస్తుండటంతో క్షేత్రస్థాయిలో ఇప్పట్నించే మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 11 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను మార్చింది.
వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అందుకు తగ్గ కసరత్తు చేస్తున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా సిట్టింగుల్ని మార్చేందుకు సిద్ధమైంది. వాస్తవానికి పనితీరు మెరుగుపర్చుకోవాలని, సర్వే ల ఆధారంగా ప్రజల్లో ఎవరికి ఆదరణ ఉంటే వారికే టికెట్ కేటాయిస్తామని దాదాపు ఏడాదిన్నరగా పదే పదే తన ఎమ్మెల్యేలకు సూచనలు చేస్తూ వస్తున్నారు. గడప గడపకు ప్రభుత్వంలో భాగంగా నిత్యం ప్రజల్లో ఉండాలని చెబుతూ వచ్చారు. కఠిన నిర్ణయాలు తీసుకోవల్సి వచ్చినప్పుడు బాదపడకుండా ఇప్పట్నించే జాగ్రత్త పడాలని చాలాసార్లు దిశానిర్దేశం చేశారు. సర్వే నివేదికల ఆధారంగా రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించనున్నారు.
మరోవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం కూడా పడినట్టు కన్పిస్తోంది. పనితీరు సరిగా లేని ప్రజా ప్రతినిధుల్ని పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి విడదల రజని, మంగళగిరికి గంజి చిరంజీవి, సంతనూతలపాడుకు మేరుగ నాగార్జున, తాటికొండకు సుచరిత, వేమూరులో అశోక్ బాబు, పత్తిపాడుకు బి కిషోర్, గాజువాకలో రామచంద్రరావు, రేపల్లెకు ఈవూరి గణేశ్, కొండెపిలో ఆదిమూలపు సురేష్, చిలకలూరిపేటకు రాజేష్ నాయుడు, అద్దంకికి పాణెం హనిమిరెడ్డిలను నియమించారు వైఎస్ జగన్.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అక్కడ సిట్టింగుల్ని మార్చకపోవడమే. ఆ పొరపాటు ఇక్కడ జరగకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావించింది. అంతకుమించి ఈ పొరపాటు చాలా మూల్యం చెల్లిస్తుందని వైఎస్ జగన్ చాలాకాలంగా నమ్ముతూ వస్తున్నదే. అందుకే ఏడాదిన్నర కాలం నుంచి పదే పదే ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు.
Also read: Srisailam: రేపే చివరి కార్తీక సోమవారం.. మల్లన్న ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook