ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులకు శుభవార్త

ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులకు శుభవార్త

Last Updated : Oct 9, 2018, 08:37 AM IST
ఏపీఎస్‌ఆర్టీసీ కార్మికులకు శుభవార్త

ఏపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) కార్మికులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు 5 నెలల డీఏను విడుదల ప్రభుత్వం చేయనుంది. ఈ మొత్తాన్ని వచ్చే నెల జీతంతో చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అటు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కాలాన్ని...స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌గా పరిగణిస్తూ సురేంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. 2013 ఆగస్టు 13 నుంచి అక్టోబర్‌ 11 వరకు సమ్మెకాలానికి బకాయిలు చెల్లించాలని నిర్ణయించగా.. ఈ చెల్లింపు రిటైర్డ్‌ ఉద్యోగులకూ వర్తించనుంది.

కాగా.. ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు ఈ ఏడాది జులైలో 19 శాతం మేర మధ్యంతర భృతి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మికులకు పీఆర్‌సీ చెల్లింపునకు ఇప్పటికే ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

దసరాకు ప్రత్యేక బస్సులు

మరోవైపు దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని ముఖ్యమైన అన్ని ప్రాంతాలకు ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా వీలైనన్ని ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.

Trending News