Jagan Govt: రోడ్ల పక్కన ఇళ్ల నిర్మాణంపై అదనపు ట్యాక్స్.. జగన్ సర్కార్ మరో బాదుడు..

Jagan Govt:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై చార్జీల మోత మోపుతుందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయినా జగన్ సర్కార్ వెనక్కి  తగ్గడం లేదు. తాజాగా జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

Written by - Srisailam | Last Updated : Aug 12, 2022, 10:51 AM IST
  • జగన్ సర్కార్ మరో బాదుడు
  • రోడ్ల పక్కన ఇళ్ల నిర్మాణంపై అదనపు ట్యాక్స్
  • ఏపీ సర్కార్ నిర్ణయంపై విపక్షాల ఫైర్
Jagan Govt: రోడ్ల పక్కన ఇళ్ల నిర్మాణంపై అదనపు ట్యాక్స్.. జగన్ సర్కార్ మరో బాదుడు..

Jagan Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై చార్జీల మోత మోపుతుందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయినా జగన్ సర్కార్ వెనక్కి  తగ్గడం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఆదాయం కోసం కొత్త దారులు వెతుకుతోంది. ఎక్కడ వీలుంటే అక్కడ ట్యాక్స్ లు విధిస్తోంది. తాజాగా జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నగరాలు, పట్టణాలు, నగర పంచాయితీల పరిధిలో కొత్త బాదుడుకు సిద్దమైంది. రోడ్ల పక్కన ఇళ్ల నిర్మాణంపై అదనపు ఫీజును వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.  

60 అడుగులు, అంతకంటే ఎక్కువ వెడల్పున్న  రహదారుల రోడ్ల పక్కన కొత్తగా నిర్మించే నాన్ కమర్షియల్ భవనాలకు ఫీజు వసూలు చేయనుంది జగన్ ప్రభుత్వ. ఇకపై రోడ్ల పక్కన కొత్త ఇళ్లను కట్టుకునేవారు ప్రస్తుతం వసూలు చేస్తున్న లైసెన్స్‌ ఫీజులు, ఇతర ఛార్జీలతో పాటు కొత్తగా ఇంపాక్ట్ ఫీజు చెల్లించాలని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఏపీ సర్కార్ కొత్తగా విధించిన ఇంపాక్ట్ ఫీజుని నాలుగు కేటగిరీలుగా నిర్ణయించారు. కేటగిరీల వారీగా ఫీజులు వసూల్ చేయనున్నారు.విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు మెట్రోపాలిటిన్ నగరాలను ఒక కేటగిరిలో పెట్టారు. మిగిలిన కార్పొరేషన్లను మరో కేటగిరిగా నిర్ణయించారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను మూడో కేటగిరిగా నిర్ధారించారు. నగరాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చే పంచాయతీలన్నీ మరో  ఒక కేటగిరిలో చేర్చారు.

ప్రస్తుతం ఉన్న రోడ్లతో పాటు కొత్తగా నిర్మించే రోడ్ల పక్కన నిర్మాణాలకు ఇక నుంచి వినియోగదారులు అదనపు ఫీజులు కట్టాల్సి ఉంటుంది. ఇంపాక్ట్ ఫీజు నిధులు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఖాతాల్లో జమ చేయనున్నది జగన్ సర్కార్. ఇంపాక్ట్ ఫీజు ద్వారా వచ్చిన రాబడిని ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం వినియోగిస్తామని జగన్ సర్కార్ తెలిపింది. ఇంపాక్ట్‌ ఫీజు కోసం ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేస్తామని.. ఆ నిధిని ఆయా ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణం,మౌలిక వసతుల కోసం ఖర్చు చేస్తామని తన ఉత్తర్వులో ప్రభుత్వం వెల్లడించింది. జగన్ సర్కార్ తాజా బాదుడుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. చెత్తపైనా పన్ను వేసిన చెత్త సర్కార్.. ఇంకా ఎన్ని బాదుడులు బాదుతోందో అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Also Read : Raksha Bandhan Special Horoscope : రక్షా బంధన్ స్పెషల్.. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల వారి జాతకం ఎలా ఉందంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News