Chandrababu Case: చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై ఇవాళ విచారణ, ఊరట లభించేనా

Chandrababu Case: ఏపీ స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు కేసులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, మద్యంతర బెయిల్ పిటీషన్లపై విచారణ జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 30, 2023, 10:45 AM IST
Chandrababu Case: చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై ఇవాళ విచారణ, ఊరట లభించేనా

Chandrababu Case: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళైనా ఊరట లభిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఏపీ హైకోర్టులో ఇవాళ రెండు బెయిల్ పిటీషన్లపై విచారణ జరిగి ఊరట లభిస్తుందా లేక మరోసారి వాయిదా పడుతుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. 

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ్టికి 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై విచారణ ఇప్పటికే ముగిసింది. తీర్పు నవంబర్ 8న వెల్లడి కానుంది. మధ్యంతర బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈలోగా దసరా సెలవులకు ముందు బెయిల్ కోరుతూ చంద్రబాబు న్యాయవాదులు హైకోర్టులో మరోసారి పిటీషన్లు దాఖలు చేశారు. ఇది కాస్తా వాయిదా పడి వెకేషన్ బెంచ్‌కు వెళ్లినా..అక్కడి న్యాయమూర్తి నాట్ బిఫోర్ అనడంతో ఇవాళ ఆ విచారణ జరగాల్సి ఉంది. ఈ బెయిల్ పిటీషన్లను జస్టిస్ టి మల్లికార్జునరావు బెంచ్ విచారించనుంది.

ఏపీ హైకోర్టులో నలుగురు కొత్త న్యాయమూర్తులు కొలువుదీరడంతో హైకోర్టు ఛీఫ్ జస్టిస్ రోస్టర్‌లో మార్పులు చేశారు. క్వాష్ పిటీషన్, బెయిల్ పిటీషన్లను వేరే బెంచ్‌కు మార్చారు. బెయిల్ పిటీషన్‌పై ఇవాళ విచారణ జరుగుతుందా లేక వాయిదా పడుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో తీర్పు పెండింగులో ఉంది. క్వాష్ పై నిర్ణయం తేలేవరకూ హైకోర్టులో విచారణ వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. 

Also read: Vizianagaram Train Accident Updates: రైల్వే శాఖ గుణపాఠం నేర్చుకోదా, ఆటో సిగ్నలింగ్ లోపమే కారణమా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News