Vizianagaram Train Accident Updates: రైల్వే శాఖ గుణపాఠం నేర్చుకోదా, ఆటో సిగ్నలింగ్ లోపమే కారణమా

Vizianagaram Train Accident Updates: విజయనగరం రైలు ప్రమాదంపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఒడిశా తరహాలోనే సిగ్నలింగ్ లోపమా లేక మరే ఇతర కారణముందా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. రైల్వే వ్యవస్థ నిర్లక్ష్యంపై ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 30, 2023, 09:59 AM IST
Vizianagaram Train Accident Updates: రైల్వే శాఖ గుణపాఠం నేర్చుకోదా, ఆటో సిగ్నలింగ్ లోపమే కారణమా

Vizianagaram Train Accident Updates: ఏపీ విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఒడిశా రైలు ప్రమాదాన్ని గుర్తు చేస్తోంది. రెండు రైళ్లు ఒకదానికొకటి వెనుక నుంచి ఢీ కొనడంపై ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ తరహా ప్రమాదాలు పెరగడంతో రైలు ప్రయాణం భద్రత ప్రశ్నార్ధకమౌతోంది. రైలు ప్రయాణమంటే భయపడే పరిస్థితి తలెత్తుతోంది. 

ఈ ఘటనలో నెంబర్ 08532 విశాఖపట్నం-పలాస రైలు కంటకాపల్లి స్టేషన్ నుంచి బయలుదేరిన 10 నిమిషాలకు చినరావుపల్లి వద్ద మధ్య లైనులో రైలు నిలిచింది. ఆ వెనుక కంటకాపల్లి నుంచి వస్తున్న08504 విశాఖపట్నం-రాయగఢ్ పాసెంజర్ వేగంగా ఢీకొట్టింది. దాంతో విశాఖ - పలాస వెనుక భాగంలోని రెండు భోగీలు, విశాఖ-రాయగడ్ మూడు భోగీలు ఒకదానిపై ఒకటి పడి నుజ్జునుజ్జయ్యాయి. కొన్ని భోగీలు పక్క ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్ రైలుపై పడ్డాయి. రెండు రైళ్లలో కలిపి మొత్తం 1400 మంది ప్రయాణీకులున్నట్టు సమాచారం. ఇప్పటి వరకూ 14 మంది మరణించగా 52 మందికి గాయాలయ్యాయి.

ఇప్పుడీ ఘటనపై పలు ప్రశ్నలు విన్పిస్తున్నాయి. విశాఖ-పలాస రైలు మధ్య లైనులో ఎందుకు నిలిచింది, ఎగువన ఉన్న అలమండ స్టేషన్ నుంచి సిగ్నల్ అందకపోవడం కారణమా లేక ప్రమాద సమయంలో అక్కడ వైర్లు తెగిపడి ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఒక మార్గంపై ఒక రైలు ఆగి ఉన్నప్పుడు మరో రైలుకు ఎలా అనుమతిచ్చారనేది ప్రదాన ప్రశ్న. ఆటో సిగ్నలింగ్ లోపమే ఇందుకు కారణమని మరి కొంతమంది భావిస్తున్నారు. అందుకే అదే మార్గంలో విశాఖ-రాయగఢ్ రైలు వచ్చేసిందంటున్నారు. ఒకవేళ సిగ్నల్ లేక విశాఖ-పలాస రైలును ఆ మధ్య లైనులో నిలిపి ఉంచినట్టయితే విశాఖ-రాయగఢ్ రైలుకు సమాచారం చేరాల్సి ఉంటుంది. లేక హైటెన్షన్ వైర్లు తెగిపడి ఉండటం వల్ల రైలు నిలిపివేసినట్టయితే అది కూడా వెనుకన వచ్చే రైళ్లకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండూ ఎందుకు జరగలేదనే కోణంలో దగర్యాప్తు సాగుతోంది. సిగ్నల్ లోపమా, మానవ తప్పిదమా తేలాల్సి ఉంది. 

ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ లోపమనుకుంటే ఒడిశాలో అంత ఘోర రైలు ప్రమాదం జరిగిన తరువాత కూడా రైల్వే శాఖ గుణపాఠం నేర్చుకోలేదా అనే విమర్శలు వస్తున్నాయి. రైల్వే శాఖ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే రైలు ప్రమాదాలు పెరుగుతున్నాయంటున్నారు. 

Also read: Vizianagaram Train Accident: విజయనగరం ఘోర రైలు ప్రమాదం, పెరుగుతున్న మృతుల సంఖ్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News