Congress MP Candidates: కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల.. పార్టీని నమ్ముకున్నోళ్లకే ఛాన్స్‌

Andhra Pradesh Congress Lok Sabha Candidates List With 9 Segments: ఏపీలో పాగా వేయాలనే లక్ష్యంతో భారీ వ్యూహం రచిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితాను పూర్తి చేసింది. చివరి జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. వారిలో పార్టీని నమ్ముకుని ఉన్నవారికే ప్రాధాన్యం దక్కింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 21, 2024, 09:35 PM IST
Congress MP Candidates: కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల.. పార్టీని నమ్ముకున్నోళ్లకే ఛాన్స్‌

Congress MP List: మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేయాలనే పక్కా ప్రణాళికతో కాంగ్రెస్‌ పార్టీ ముందుకువెళ్తోంది. వైఎస్‌ షర్మిల సారథ్యంలో ప్రస్తుత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికలో పార్టీని నమ్ముకున్నవారికే అవకాశం కల్పించడం విశేషం. ఇప్పటికే తొలి జాబితా విడుదల కాగా తాజాగా మరో జాబితాలో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాటితోపాటు జార్ఖండ్‌లోని రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

Also Read: YS Sharmila Assets: తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఆస్తులున్న మహిళ షర్మిల.. ఆమె ఆస్తులెన్నో తెలుసా?

 

  • శ్రీకాకుళం- డాక్టర్‌ పరమేశ్వర రావు
  • విజయనగరం- బొబ్బిలి శ్రీను
  • జంగా గౌతమ్‌- అమలాపురం
  • గొల్లు కృష్ణ - మచిలీపట్నం
  • విజయవాడ - వల్లూరు భార్గవ్‌ 
  • ఒంగోలు - సుధాకర్‌ రెడ్డి
  • నంద్యాల - లక్ష్మీ నరసింహ యాదవ్‌
  • అనంతపురం - మల్లికార్జున్‌
  • హిందూపురం - సమద్‌ షాహీన్‌

Also Read: Chiranjeevi: ఏపీ ఎన్నికలపై మెగాస్టార్‌ చిరంజీవి సంచలన నిర్ణయం.. పవన్‌కల్యాణ్‌కా? జగన్‌కా మద్దతు?

ఏపీలోని 25 పార్లమెంట్‌ స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ఒంటరి పోరాటం చేస్తోంది. అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 6 స్థానాలకు, రెండో జాబితాలో ఐదు లోక్‌సభ నియోజకవర్గాలకు.. మూడో జాబితాలో 9 మందితో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కడప లోక్‌సభ సెగ్మెంట్‌ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఏపీలో పాగాకు వ్యూహం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు కారణంగా కాంగ్రెస్‌ పార్టీని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఏపీలో కాంగ్రెస్‌ నామరూపాల్లేకుండా పోయింది. 2014, 2019 ఎన్నికలతోపాటు ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ కనిపించలేదు. పదేళ్ల పాటు నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్‌కు ఇప్పుడే కొత్త జోష్‌ వచ్చింది. విభజన గాయాన్ని ప్రజలు మరచిపోయారని భావిస్తూనే.. ఉమ్మడి ఏపీ సీఎం, దివంగత వైఎస్సార్‌ కుమార్తె షర్మిలను రంగంలోకి దింపడం కాంగ్రెస్‌ భారీ వ్యూహం దాగి ఉంది. ప్రస్తుత సీఎం జగన్‌కు చెక్‌ పెడుతూనే షర్మిల సారథ్యంలో పార్టీకి జవసత్వాలు అందించాలని భావిస్తోంది. 2024 ఎన్నికల్లోనూ ఏ స్థానంలోనూ పార్టీ గెలవదని అందరికీ తెలిసిందే. కానీ ఓటింగ్‌ శాతం పెంచుకోవాలనే ఆశతో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో ఒంటరిగా పోటీ చేస్తూ తన సత్తా చూపేందుకు సిద్ధమైంది. మరి ఏపీలో కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరిస్తారా లేదా అనేది వేచి చూడాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News