Andhra Pradesh: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 93 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) రాష్ట్రంలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. 

Last Updated : Aug 23, 2020, 06:50 PM IST
Andhra Pradesh: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 93 మంది మృతి

AP Covid-19 Cases updates : అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ( Andhra Pradesh ) రాష్ట్రంలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం 9వేలకు పైగానే కేసులు నమోదవుతుండగా.. నిన్న కొంచెం తగ్గాయి. గత 24గంటల్లో 7,895 కరోనా కేసులు నమోదైనట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్యశాఖ ( AP Health Ministry ) ఆదివారం సాయంత్రం వెల్లడించింది. దీంతోపాటు 93 మంది మరణించినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,53,111కు పెరగగా.. ఇప్పటివరకు 3,282 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. Also read: Narendra Modi: నెమళ్లకు ఆహారం అందించిన ప్రధాని.. వీడియో వైరల్

ప్రస్తుతం రాష్ట్రంలో 89,742 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఇప్పటివరకు 2,60,087 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 46,712 మందికి కరోనా పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 32,38,038 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. జిల్లాల వారీగా కరోనా కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి..

ap corona bulletin

 Also read: JEE-NEET Exams: విద్యార్థుల మ‌న్ కీ బాత్ వినండి: రాహుల్ గాంధీ

Trending News