Narendra Modi: నెమళ్లకు ఆహారం అందించిన ప్రధాని.. వీడియో వైరల్

ప‌్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ( Narendra Modi ) ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తారో మనందరికీ తెలుసు. పర్యావరణమన్నా.. జీవరాశులన్నా.. ఆయన అమితంగా ఇష్టపడతారు. అయితే.. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ త‌న రోజువారీ ఉద‌య‌పు దిన‌చ‌ర్య‌లోని కొన్ని క్షణాలను వీడియోగా మలిచి ఇన్‌స్టాగ్రాం‌మ్‌ ద్వారా ఆదివారం పంచుకున్నారు.

Last Updated : Aug 23, 2020, 04:45 PM IST
Narendra Modi: నెమళ్లకు ఆహారం అందించిన ప్రధాని.. వీడియో వైరల్

PM Modi feeding Peacocks: ఢిల్లీ: ప‌్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ( Narendra Modi ) ప్రకృతిని ఎంతగా ఆరాధిస్తారో మనందరికీ తెలుసు. పర్యావరణమన్నా.. జీవరాశులన్నా.. ఆయన అమితంగా ఇష్టపడతారు. అయితే.. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ త‌న రోజువారీ ఉద‌య‌పు దిన‌చ‌ర్య‌లోని కొన్ని క్షణాలను వీడియోగా మలిచి ఇన్‌స్టాగ్రాం‌మ్‌ ద్వారా ఆదివారం పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్‌లో నెమళ్లకు ఆహారం ( PM Modi feeding Peacocks)  అందిస్తున్న వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అయితే ప్రధానికి ప‌లు నెమ‌ళ్లు మ‌చ్చిక అయిన దృశ్యాలను ఈ వీడియోలో ఉంచారు. ఈ వీడియోను షేర్ చేస్తూ ప్రధాని మోదీ విలువైన క్షణాలు అనే క్యాప్షన్‌తోపాటు హిందీలో రాసిన పద్యాన్ని సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. Also read: JEE-NEET Exams: విద్యార్థుల మ‌న్ కీ బాత్ వినండి: రాహుల్ గాంధీ

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

भोर भयो, बिन शोर, मन मोर, भयो विभोर, रग-रग है रंगा, नीला भूरा श्याम सुहाना, मनमोहक, मोर निराला। रंग है, पर राग नहीं, विराग का विश्वास यही, न चाह, न वाह, न आह, गूँजे घर-घर आज भी गान, जिये तो मुरली के साथ जाये तो मुरलीधर के ताज। जीवात्मा ही शिवात्मा, अंतर्मन की अनंत धारा मन मंदिर में उजियारा सारा, बिन वाद-विवाद, संवाद बिन सुर-स्वर, संदेश मोर चहकता मौन महकता।

A post shared by Narendra Modi (@narendramodi) on

ప్ర‌ధాని నివాస ప్రాంగ‌ణం, ఎల్‌కేఎం కాంప్లెక్స్‌లో నెమ‌ళ్లు స్వేచ్ఛ‌గా సంచ‌రిస్తూ.. ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వ్యాయమ దినచర్య సమయంలో, పలు సందర్భాల్లో మోదీ ప్ర‌తీరోజు వాటికి ఆహారాన్ని స్వ‌యంగా అందిస్తూ కనిపించారు. పలుసందర్భాల్లో నెమ‌ళ్లు పురివిప్పిన సుంద‌ర దృశ్యాలు మ‌న‌స్సుకు ఎంతో ఉల్లాసాన్నిస్తున్నాయి.  అయితే..  నివాస ప్రాంగ‌ణంలో ప్ర‌ధాని ప‌లు ప‌క్షుల‌కు గూళ్లను సైతం ఏర్పాట్లు చేశారు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లందరూ తెగ సంబరపడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం అన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై వైరల్ అవుతోంది.  Also read: JEE Main Admit Card: జేఈఈ మెయిన్స్, NEET హాల్‌ టికెట్లు ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Trending News