Graduate MLC Election: ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి, మరోసారి ఉత్తరాంధ్ర బరిలో అడారి కిశోర్ కుమార్

Graduate MLC Election: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి అడారి కిశోర్ కుమార్ పోటీకు సిద్ధమౌతున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 24, 2022, 11:01 AM IST
Graduate MLC Election: ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి, మరోసారి ఉత్తరాంధ్ర బరిలో అడారి కిశోర్ కుమార్

Graduate MLC Election: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి అడారి కిశోర్ కుమార్ పోటీకు సిద్ధమౌతున్నారు. 

మరో 5-6 నెలల్లో జరగాల్సిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు అప్పడే వేడి రాజుకుంది. ఒంగోలు, ఉత్తరాంధ్ర, చిత్తూరు స్థానాలకు ఈ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. పార్టీ రహిత ఎన్నికలే అయినా..రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పేరుతో కొత్త ఒరవడి సృష్టించడంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారవచ్చు. 

ప్రస్తుతం ఈ స్థానంలో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్ధి బీసీ సామాజికవర్గానికి చెందిన మాధవ్ ఉన్నారు. పదవీకాలం త్వరలో ముగియనుండటంతో అన్ని పార్టీలు ఉత్తారాంధ్ర ఎమ్మెల్సీ స్థానంపై దృష్టి కేంద్రీకరించాయి. గతంలో ఈ స్థానాన్ని రెండుసార్లు కమ్యూనిస్టు పార్టీ మద్దతిచ్చిన అభ్యర్ధులు గెలవగా..2019లో మాత్రం తొలిసారిగా టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్ధి మాధవ్ గెలిచారు. ఆ సమయంలో టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన అడారి కిశోర్ కుమార్ ఇప్పుడు మరోసారి పోటీకు సిద్ధమౌతున్నారు. 

అడారి కిశోర్ కుమార్ సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం జేఏసీ కన్వీనర్‌గా వ్యవహరించారు. ఉత్తరాంధ్ర స్థానాన్ని తెలుగుదేశం పార్టీ బీసీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశాలు కన్పిస్తున్నందున టీడీపీ మద్దతు అడారి కిశోర్ కుమార్‌కు లభించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమ సమయం నుంచి టీడీపీ నేతలతో, పార్టీతో కిశోర్ కుమార్‌కు మంచి సంబంధాలుండటమే కాకుండా ఆ పార్టీ రాష్ట్ర యువజన సంఘం జేఏసీ అధ్యక్షుడిగా పనిచేశారు. అటు బీజేపీ తరపున మాధవ్ మరోసారి బరిలో దిగే అవకాశాలున్నాయి. ఇక అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్ధిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సీతం రాజు సుధాకర్ పేరు ప్రకటించింది. 

సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి అటు ఉపాధ్యాయ వర్గాల్లో ఇటు యువతలో మంచి సంబంధాలు కలిగిన అడారి కిశోర్ కుమార్ బీసీ కావడం కాస్త అనుకూలించే అంశంగా ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థాననంలో అధిక సంఖ్యలో ఓటర్లు బీసీలే. 2023 ఫిబ్రవరి నెలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. టీడీపీ మద్దతు ఆడారి కిశోర్ కమార్‌కు లభిస్తుందో లేదో వేచి చూడాలి. 

Also read: CM Jagan: వృద్ధి రేటులో టాప్‌లో ఉన్నాం..స్పందన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News