Jagan Govt: ఒక్క నిమిషం లేటైనా ఆబ్సెంటే! ఏపీ టీచర్లకు కొత్త సిస్టమ్..

Jagan Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల కోసం కొత్త విధానం తీసుకొచ్చింది. మంగళవారం(ఆగస్టు 16) నుంచే అమలు చేయబోతోంది.

Written by - Srisailam | Last Updated : Aug 16, 2022, 09:24 AM IST
  • టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్‌ సిస్టమ్
  • సిమ్స్‌ ఏపీ యాప్ లో హాజరు
  • స్మార్ట్‌ఫోన్ లేని టీచర్లకు కష్టాలే
Jagan Govt: ఒక్క నిమిషం లేటైనా ఆబ్సెంటే! ఏపీ టీచర్లకు కొత్త సిస్టమ్..

Jagan Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల కోసం కొత్త విధానం తీసుకొచ్చింది. మంగళవారం(ఆగస్టు 16) నుంచే అమలులోకి వచ్చింది.  ఏపీలో ఇప్పటివరకు ఉపాధ్యాయుల హాజరుకు బయో మెట్రిక్, ఐరిస్ విధానం అమలు చేస్తున్నారు. వీటి స్థానంలో కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్‌ సిస్టమ్ ను ఏపీ విద్యాశాఖ తీసుకొచ్చింది. ఇందుకోసం సిమ్స్‌-ఏపీ అనే మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. టీచర్లు సహా స్కూళ్లలో పనిచేసే సిబ్బంది మొత్తం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించింది.

సిమ్స్‌-ఏపీ యాప్ లో మొదట స్కూల్ ప్రధానోపాధ్యాయుడు లాగిన్ అవుతారు. తర్వాత అతనే మిగితా స్టాప్ వివరాలను యాప్ లో ఎంట్రీ చేస్తారు. ఉద్యోగులకు సంబంధించిన లీవ్స్ వివరాలు కూడా అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత టీచర్లు వారి ఫొటోలను మూడు భంగిమల్లో తీసి సిమ్స్‌ ఏపీ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక రోజు స్కూల్ కు వచ్చిన వెంటనే ఉపాధ్యాయుడు యాప్‌లో లాగిన్ అయి ఫొటో తీసుకుని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఉదయం 9 గంటలలోపే చేయాలి. ఒక్క నిమిషం లేటైనా యాప్ తీసుకోదు. సెలవు పెట్టుకోవాలని సూచిస్తుంది.

సిమ్స్‌ ఏపీలో అవతకవలు చేయడానికి కూడా వీలు లేదు. స్కూల్ కు రానున్నా ఉదయం 9 గంటల లోపు ఫోటో తీసుకుని యాప్ లో అప్ లోడ్ చేయడం సాధ్యం కాదు. యాప్ కు జీపీఎస్ లింక్ అయి ఉంటుంది. జీపీఎస్ ఆధారంగా ప్రతి స్కూల్ ను గుర్తిస్తారు. సో.. స్కూల్ కు రాకుండా ఫోటో అప్ లోడ్ చేయడం కుదరదు. ఖచ్చితంగా స్కూల్ దగ్గరే ఫొటో తీసుకుని యాప్ లో అప్ లోడ్ చేయాల్సిందే. కొత్త సిస్టమ్ తో టీచర్లు ఉదయం 9 గంటల లోపు ఖచ్చితంగా స్కూల్ కు రావాల్సిందే. లేదంటే లీవ్ పెట్టుకోవాల్సిందే. బయోమెట్రిక్ సరిగా పనిచేయకపోవడం వలనే కొత్త యాప్ తీసుకొచ్చామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు ఫేషియల్ రికగ్నిషన్‌ సిస్టమ్ ప్రకారం హాజరు తీసుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ లేని ఉపాధ్యాయులు ఏం చేయాలని, యాప్ లో వాళ్లు ఎలా ఫోటో అప్ లోడ్ చేస్తారని ప్రశ్నిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సమస్య ఉంటుందని.. అలాంటి ప్రాంతాల్లో యాప్ వినియోగం కష్టమవుతుందని చెబుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు, బస్సుల ఆలస్యంతో కొన్ని సార్లు స్కూల్ రావడం ఆలస్యమవుతుందని అంటున్నారు. ఫేషియల్ రికగ్నిషన్‌ సిస్టమ్ అమలుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు.
Read also: Khammam Murder: తుమ్మల ప్రధాన అనుచురుడు దారుణ హత్య.. స్వాతంత్ర దినోత్సవం రోజునే దారుణం 

Read also: Munugode Byelction: మంత్రిని పట్టించుకోని అసమ్మతి నేతలు.. మునుగోడు టీఆర్ఎస్ నిలువునా చీలిపోనుందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News