JC Brothers House Arrest: అట్టుడుకుతున్న తాడిపత్రి.. జేసీ సోదరుల హౌస్ అరెస్ట్

JC Brothers House Arrest: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఏపీ పోలీసులు నిర్విర్యం చేస్తున్నారంటూ జేసీ సోదరులు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. నేడు తాడిపత్రి ఎమ్మార్వో కార్యాలయం వద్ద మౌనదీక్ష చేపడతామని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో జేసీ బ్రదర్స్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

Last Updated : Jan 4, 2021, 11:57 AM IST
  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఏపీ పోలీసులు నిర్విర్యం చేస్తున్నారంటూ ఆరోపించారు
  • నేడు తాడిపత్రి ఎమ్మార్వో కార్యాలయం వద్ద మౌనదీక్ష చేపడతామన్న జేసీ ప్రభాకర్ రెడ్డి
  • ఈ నేపథ్యంలో జేసీ బ్రదర్స్‌ను ముందస్తుగానే పోలీసులు గృహనిర్బంధం చేశారు
JC Brothers House Arrest: అట్టుడుకుతున్న తాడిపత్రి.. జేసీ సోదరుల హౌస్ అరెస్ట్

JC Brothers House Arrest: రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై దాడులు ఉద్రికత్తలకు దారితీస్తున్నాయి. అయినా ఈ ఘటనలు కొనసాగుతున్నాయి తప్ప.. తగ్గడం లేదు. దీంతో ప్రతిపక్షాలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడులకు దిగుతున్నారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఏపీ పోలీసులు నిర్విర్యం చేస్తున్నారంటూ జేసీ సోదరులు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

నేడు తాడిపత్రి ఎమ్మార్వో కార్యాలయం వద్ద మౌనదీక్ష చేపడతామని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో జేసీ బ్రదర్స్‌ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. జేసీ దివాకర్ రెడ్డి(JC Diwakar Reddy)ని జూటురులోని ఆయన ఫామ్‌హౌస్‌లో హౌస్ అరెస్ట్ చేయగా, సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆయన స్వగృహంలో నిర్భందించారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 

Also Read: YSR Rythu Bharosa Scheme: మనీ ఖాతాల్లోకి రాలేదా.. అయితే ఇలా చేయండి

కాగా, గత ఏడాది డిసెంబర్ 24వ తేదీన అధికార వైఎస్సార్‌సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య రాళ్ల దాడి జరిగింది. దీనికి సంబంధించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy)పై, ఆయన కుమారుడిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులను పోలీసులు నమోదు చేశారు. తమపై కక్షపూరితంగా కేసులు బనాయిస్తున్నారని జేసీ సోదరులు ఇటీవల ఆరోపించారు. 

Also Read: SBI గుడ్ న్యూస్.. ఇకనుంచి వారికి ఇంటి వద్దకే బ్యాంక్ సేవలు

ఈ మేరకు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి తాడిపత్రి ఎమ్మార్వో ఆఫీసు వద్ద దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. తాడిపత్రిలో భారీ సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. తాడిపత్రిలో 144 సెక్షన్ విధించారు. పట్టణంలో ఎలాంటి ధర్నాలు, నిరసనలకు అనుమతులు ఇవ్వలేవని పోలీసులు తెలిపారు.

Also Read: Gold Price Today 4th January 2020: స్వల్పంగా పుంజుకున్న బంగారం ధరలు.. తగ్గిన వెండి! 

రాజకీయాలు, క్రీడలు, వినోదం, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News