Loksabha Elections 2024: మధ్యాహ్నం ౩ గంటల వరకు డెడ్ లైన్.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల కమిషన్..

General Elections 2024: కేంద్ర ఎన్నికల సంఘం నిన్న లోక్ సభతో పాటు,  (శనివారం) నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయా రాష్ట్రాలలో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసిందని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలో రాజకీయ ప్రకటనలో హోర్డింగ్ లు, కటౌట్లపై తాజాగా, ఏపీ ఎన్నికల ప్రధానాధికారి కీలక ఆదేశాలు జారీచేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : Mar 17, 2024, 12:17 PM IST
  • ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు..
  • వెంటనే హోర్డింగ్ లు, కటౌన్స్ లను తొలగించాలన్న ఎన్నికల అధికారి..
Loksabha Elections 2024: మధ్యాహ్నం ౩ గంటల వరకు డెడ్ లైన్.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల కమిషన్..

AP CEO Mukeshkumar Meena Orders To Remove All Hoardings: దేశంలో ఐదు రాష్ట్రాలలో ఎన్నికల నగరా మోగింది. చీఫ్ ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ తెలిపారు. తొలిసారి 1.85 కోట్ల మంది తమ ఓటను వినియోగించుకొనునట్లు సీఈసీ వెల్లడించారు. వీరిలో 49.7 కోట్ల మంది పురుషులు, 47.1 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఈ క్రమంలో దేశంలోని ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కింలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. టీవీ, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..

ఇప్పటికి 11 రాష్ట్రాలలో , హింసకు పాల్పడితే నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేస్తామని హెచ్చరించారు. ఈ ఎన్నికలలో 55 లకల ఈవీఎంలను ఉపయోగిస్తున్నట్లు ఈసీ తెలిపారు. దేశవ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

55 లక్షల ఈవీఎంలు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారని చెప్పారు. జూన్ 16వ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎన్నికలలో ఎలాంటి ప్రలోభాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఎన్నికల విధులకు వాలంటీర్లు పూర్తిగా దూరంగ ఉంచాలన్నారు. బ్యాంక్‌ లావాదేవీలపై కూడా నిఘా ఉంటుందన్నారు.  ఎన్నికల సమయంలో తప్పుడు ప్రకటనలపై వచ్చే ఫిర్యాదులపై వేగంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Read More: Bathing Tips:బాత్రూమ్ లో నగ్నంగా స్నానం చేస్తున్నారా..?.. మీ జీవితంలో ఈ అరిష్టాలు తప్పవంటున్న జ్యోతిష్యులు..

ఇదిలా ఉండగా.. ఏపీ ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో ఉన్న రాజకీయ ప్రకటనలకు చెందిన హోర్డింగ్ లు, కటౌట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అదేవిధంగా.. సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాల చుట్టపక్కల ఉన్న హోర్డింగ్ లు, కటౌట్లను వెంటనే తొలగించాలన్నారు. ఈరోజు మధ్యాహ్నం ౩ వరకు దీనిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొవాలన్నారు. ఇప్పటికే దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో వచ్చేసిన విషయం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News