Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..

Lady Teacher Hot Steps: బంటీ ఔర్ బబ్లీ సినిమాలో కజరారే కజరారే పాట ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ లు ముగ్గురు మాస్ స్టెప్పులతో అందరిని ఆకట్టుకున్నారు. ఆ పాట సోషల్ మీడియాలో కూడా ఫుల్ వైరల్ గా మారింది. ఈ క్రమంలో తాజాగా ఒక లేడీ టీచర్ ఇదే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Mar 17, 2024, 09:54 AM IST
  • క్లాసులోనే మాస్‌ స్టెప్పులతో ఊపేసిన లేడీ టీచర్..
  • సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న వీడియో..
Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..

Female Teacher Mass Steps On kajra Re Song: సోషల్ మీడియా పుణ్యామా అని ప్రతి ఒక్కరు తమ టాలెంట్ ను వీడియోలు, రీల్స్ లా తీసి సామాజిక మాధ్యమంలో పంచుకుంటున్నారు. ఒకప్పుడు తమ టాలెంట్ ను పంచుకోవడానికి ఎవరికి కూడా సరైన ప్లాట్ ఫామ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే ఆ వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా వీటిని ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఓవర్ నైట్ లో  స్టార్ లు అయిపోతున్నారు. ఇప్పటికే అనేక సినిమాలోని ఐటమ్ సాంగ్ లు తరచుగా వైరల్ గా మారతుంటాయి. సినిమాలోని హిట్ పాటలను జనాలు తమ దైన స్టైల్ లలో ఐటమ్ పాటకు స్టెప్పులు వేసి అందరిని షాకింగ్ కు గురిచేస్తుంటారు.

 

ఇప్పటికే..లుంగీ డ్యాన్స్.. ఊ అంటవా.. ఊఊ అంటావా.. ఐటంసాంగ్ ఏరెంజ్ లో ఫెమస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మీద చిన్న పెద్ద తేడా లేకుండా అనేక మంది అమ్మాయిలు మాస్ స్టెప్పులతో తరచుగా డ్యాన్స్ లు చేసిన  అనేక వీడియోలు ట్రెండింగ్ లో నిలిచాయి. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఒక లేడీ టీచర్ చేసిన డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

క్లాసులో లేడీ టీచర్ చేసిన డ్యాన్స్  సోషల్ మీడియాను ఊపేస్తుంది. తరగతి గదిలో మహిళా టీచర్.. బర్త్  డే వేడుకలు  తరగతి గదిలో నిర్వహించారు. దీనిలో.. విద్యార్థులు బోర్డుమీద హ్యాపీ బర్త్ డే.. రష్మీ టీచర్‌ అంటూ రాశారు. అంతే కాకుండా జోరుగా బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ క్రమంలో బంటీ ఔర్ బబ్లీ పాటకు లేడీ టీచర్ వేసిన మాస్ స్టెప్పులకు స్టూడెంట్స్ అంతా షాక్ కు గురయ్యారు. అచ్చం కాజరారే పాటలో ఐశ్వర్యరాయ్ వేసినట్లు.. ఈ లేడీ టీచర్ కూడా అదిరిపోయే స్పెప్పులు వేసింది. లేడీ టీచర్ ఫెస్ ఎక్స్ ప్రెషన్స్, స్టెప్పులు చూస్తుంటే.. అచ్చం ఐశ్వర్యరాయ్ గుర్తుకొస్తారు. క్లాసులో స్టూడెంట్స్ కూడా టీచర్ స్టెప్పులకు చప్పట్లు, విజిల్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు.

Read More: Eating More Pythons: జస్ట్ ఫర్ ఏ చెంజ్... కొండ చిలువలను తినాలంటున్న పరిశోధకులు... కారణం ఏంటంటే..?

ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. కానీ ఈ డ్యాన్స్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం లేడీ టీచర్ మాస్ స్టెప్పులకు ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా.. మాములు స్టెప్పులు కాదు భయ్యా.. సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం క్లాసులో టీచర్ స్టెప్పులు వేయడం ఏంటని కూడా కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైన ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News