Nimmada Election Results: 4 దశాబ్దాల చరిత్రలో తొలిసారి, నిమ్మాడలో YSRCPకి భారీ షాక్ ఇచ్చిన TDP

Nimmada Election Results 2021: తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భిన్నమైన పంచాయతీ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సైతం పోలింగ్ జరిగింది. అధికార YSRCPకి ప్రతిపక్ష టీడీపీ నేత కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబం షాకిచ్చింది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 10, 2021, 01:17 PM IST
  • తొలి విడతలో 2,723 సర్పంచ్‌ స్థానాలకు, 20,157 వార్డు పదవులకు పోలింగ్
  • 82 శాతానికి పైగా స్థానాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా
  • నాలుగు దశాబ్దాలలో తొలిసారిగా నిమ్మాడలో ఎన్నికలు, అధికార పార్టీకి షాక్
Nimmada Election Results: 4 దశాబ్దాల చరిత్రలో తొలిసారి, నిమ్మాడలో YSRCPకి భారీ షాక్ ఇచ్చిన TDP

Nimmada Election Results: ఏపీలో పంచాయతీ ఎన్నికలు తొలి విడతలో 2,723 సర్పంచ్‌ స్థానాలకు, 20,157 వార్డు పదవులకు మంగళవారం పోలింగ్‌ జరిగింది. ఇందులో 82శాతానికి పైగా స్థానాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. మిగతా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందారు.

తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో భిన్నమైన పంచాయతీ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సైతం పోలింగ్ జరిగింది. నిమ్మాడలో భారీ భద్రత మధ్య పోలింగ్ జరగగా, కింజరాపు కుటుంబం నిమ్మాడలో మరోసారి తమ పట్టు నిరూపించుకుని అధికార YSRCPకి షాకిచ్చింది. నిమ్మాడ పంచాయతీ సర్పంచ్ అభ్యర్ధి కింజరాపు సురేష్ 1670 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పన్నకు 157 ఓట్లు పోలయ్యాయి.

Also Read: AP Panchayat Elections 2021: తొలి దశ పోలింగ్‌లో విషాదం, గుండెపోటుతో పోలింగ్ ఏజెంట్ మృతి

కాగా, నాలుగు దశాబ్దాల నిమ్మాడ చరిత్రలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు(AP Panchayat Elections 2021) నిర్వహించగా, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబసభ్యులు విజయం సాధించారు. నామినేషన్ వేశారన్న కారణంగా ఓ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారన్న కేసులో అచ్చెన్నాయుడును పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.

Also Read: Atchannaidu Arrest: ఏపీ TDP అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్, Chandrababu ఆగ్రహం 

ఏపీలో స్థానిక పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీలకు, ఆయా గ్రామాల్లోని 32,502 వార్డు పదవులకు జనవరి 23వ తేదీన నోటిఫికేషన్లు జారీ చేశారు. అన్ని జిల్లాల్లో కొన్ని స్థానాల్లో వార్డులు, సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. 

Also Read: Supreme court: అమరావతి భూకుంభకోణం కేసులో టీడీపీ నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News