AP Panchayat Elections ఫిర్యాదుల కోసం E-Netram App ఆవిష్కరించిన వైఎస్సార్‌సీపీ

E-Netram App: AP Panchayat Elections 2021 | ఏపీ ఎలక్షన్ ఈ వాచ్ యాప్‌నకు పోటీగా వైఎస్సార్‌సీపీ మరో ప్రత్యేక యాప్‌ను అదేరోజు లాంచ్ చేయడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ ఈ నేత్రం(E-Netram App) పేరుతో మరో ఎలక్షన్ యాప్ తీసుకొచ్చింది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 4, 2021, 11:15 AM IST
AP Panchayat Elections ఫిర్యాదుల కోసం E-Netram App ఆవిష్కరించిన వైఎస్సార్‌సీపీ

E-Netram App: AP Panchayat Elections 2021 | ఏపీలో పంచాయతీ ఎన్నికల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు చేసేందుకు ఎపీ ఎలక్షన్ కమిషన్ ఈ-వాచ్ యాప్(E-Watch App)ను బుధవారం నాడు ఆవిష్కరించింది. దీనికి పోటీగా వైఎస్సార్‌సీపీ మరో ప్రత్యేక యాప్‌ను అదేరోజు లాంచ్ చేయడం గమనార్హం.

ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్(Nimmagadda Ramesh Kumar) బుధవారం నాడు ఈ-వాచ్ యాప్(E-Watch App)ను ఆవిష్కరించారు. బుధవారం రాత్రికల్లా వైఎస్సార్‌సీపీ ఈ నేత్రం(E-Netram App) పేరుతో మరో ఎలక్షన్ యాప్ తీసుకొచ్చింది. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరేడ్డి E-Netram Appను విడుదల చేశారు.

Also Read: Ujjwala Yojana: Free LPG కనెక్షన్, రూ.1600 రావాలంటే PMUY వివరాలు తెలుసుకోండి

ఏపీలో పంచాయతీ ఎన్నికల(AP Panchayat Elections Latest Updates)కు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. తమ ఫిర్యాదును ఫొటోలు వీడియోల రూపంలో సైతం అందించవచ్చునని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు చేరవేయనున్నట్లు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ-వాచ్ యాప్(E-Watch App)ను తీసుకొచ్చిందని, ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉందన్నారు.

Also Read: AP Panchayat Elections 2021: ఈ-వాచ్ యాప్‌ ఆవిష్కరించిన ఏపీ ఎస్ఈసీ, AP SEC E-Watch Appపై ఊహించని షాక్

కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన యాప్‌పై తమకు అనుమానాలు ఉన్నాయని వైఎస్సార్‌సీపీ నేతలు మొదట్నుంచీ చెబుతున్నారు. అది నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రైవేట్ యాప్ అని సైతం ఆరోపించారు. ఈ-వాచ్ యాప్ మీద అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో తాము ఈ నేత్రం(E-Netram App)ను ఆవిష్కరించామని చెప్పారు. ఈ నేత్రం యాప్‌లో తమకు అందించిన ఫిర్యాదులను ఏపీ ఎలక్షన్ కమిషన్‌కు చేరవేస్తామని వివరించారు.

Also Read: Today Horoscope, 04 February 2021: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 4, 2021 Rasi Phalalu

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News