Supreme court: అమరావతి భూకుంభకోణం కేసులో టీడీపీ నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme court: అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. కేసుకు సంబంధించిన తెలుగుదేశం నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Last Updated : Feb 9, 2021, 01:08 PM IST
  • అమరావతి భూకుంభకోణంపై సిట్ ఏర్పాటు, దమ్మాలపాటి కేసుల్లో సుప్రీంకోర్టు విచారణ
  • కౌంటర్ దాఖలు చేయనందుకు టీడీపీ నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం, రెండు వారాల గడువు
  • రీజాయిండర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచన
Supreme court: అమరావతి భూకుంభకోణం కేసులో టీడీపీ నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme court: అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. కేసుకు సంబంధించిన తెలుగుదేశం నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆంధ్రప్రదేశ్( Andhra pradesh ) రాజధానిగా అమరావతి ( Amaravati ) ప్రకటన నేపధ్యంలో జరిగిన భూలావాదేవీల్లో కుంభకోణం దాగుందనేది ఏపీ ప్రభుత్వ( Ap government ) వాదన. గత ప్రభుత్వ హయాంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆధారంగా అమరావతి చుట్టుపక్కల భూముల కొనుగోలులో లబ్దిపొందారనే ప్రాధమిక సాక్ష్యాల ఆధారంగా కేసు నమోదైెంది. ప్రభుత్వ సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా పలువురిపై కేసు నమోదైంది. అయితే తనపై కేసు విషయంలో దమ్మాలపాటి స్టే తెచ్చుకున్నారు. హైకోర్టు స్టేను సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

అమరావతి భూకుంభకోణం ( Amaravati land scam )పై సిట్ ( SIT ) ఏర్పాటు, దమ్మాలపాటిపై కేసు ( Dammalapati case ) విషంలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులకు టీడీపీ నేతలు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ఆఖరి అవకాశమని సుప్రీంకోర్టు ( Supreme court )స్పష్టం చేసింది. లేకపోతే తామే ప్రొసీడ్ అవుతామని హెచ్చరిస్తూ..రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీడీపీ నేతలు ( Tdp leaders ) వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లను సుప్రీంకోర్టు ఆదేశించింది. అటు రీ జాయిండర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో మార్చ్ 5న తుది విచారణ జరగనుంది. 

Also read: Village Boycott Elections: నిమ్మగడ్డ వైఖరికి నిరసనగా ఎన్నికల్ని బహిష్కరించిన గ్రామం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News