పరిటాల రవి ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్..!

జ‌న‌సేన‌ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఏపీ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీతమ్మను ఈ రోజు ఉదయం కలిశారు.

Last Updated : Jan 28, 2018, 11:15 AM IST
పరిటాల రవి ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్..!

జ‌న‌సేన‌ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఏపీ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీతమ్మను ఈ రోజు ఉదయం కలిశారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ శనివారం ఆ జిల్లాలోని వ్యవసాయ నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతపురంలోని వ్యవసాయపరమైన ఇబ్బందులకు పరిష్కారాలు సూచించమని.. వాటిని తాను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ రోజు ఆయా అంశాలను రాష్ట్ర మంత్రి పరిటాల సునీతమ్మ వద్దకు తీసుకెళ్లేందుకు ఆమె ఇంటికి మర్యాదపూర్వకంగా వెళ్లారు. ఆ విధంగా చూస్తే.. తొలిసారిగా పరిటాల రవి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లినట్లు భావించవచ్చని కొందరు ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు పరిటాల సునీతమ్మ ఇంటికి వెళ్లిన పవన్.. ఆ క్రమంలో హంద్రీనీవా ప్రాజక్టు పై కూడా చర్చించారు. 

Trending News