కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లాలో ఎన్ని పటిష్ట భద్రతలు చేసినా రోడ్డు ప్రమాదాలు ఆగటం లేదు.  జిల్లాలో ఎదో ఒక మూలన రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.

Updated: Jan 3, 2018, 12:22 PM IST
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కర్నూలు జిల్లాలో ఎన్ని పటిష్ట భద్రతలు చేసినా రోడ్డు ప్రమాదాలు ఆగటం లేదు.  జిల్లాలో ఎదో ఒక మూలన రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి వరుసగా మూడురోజులు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నేడు కూడా జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆస్పరి మండలం చిన్నహోతూరు కర్నూలు-బళ్ళారి రహదారిపై టైరుపేలి మినిటిప్పర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరికి పైగా మృతువాతపడ్డారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చు. గాయపడ్డవారందరినీ ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా హోళుగొంద మండలం కొత్తపేట వాసులుగా పోలీసులు గుర్తించారు. 

జనవరి1, 2వ తేదీల్లో కూడా కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలో ఏడుమందికి పైగా చనిపోయారు. జనవరి1 ఆళ్లగడ్డ, జనవరి2 ఎమ్మిగనూరు కోటేకళ్లు వద్ద ప్రమాదాలు జరిగాయి.