COVID-19: ఏపీలో 24 గంటల్లో 97 మంది మృతి

ఏపీలో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల మధ్య  53,026 శాంపిల్స్‌ని ( COVID-19 tests ) పరీక్షించగా.. అందులో 8,943 మందికి కరోనా సోకినట్టు నిర్దారణ అయ్యింది. అదే సమయంలో కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా రాష్ట్రంలో 97 మంది చనిపోయారు.

Last Updated : Aug 14, 2020, 10:45 PM IST
COVID-19: ఏపీలో 24 గంటల్లో 97 మంది మృతి

అమరావతి: ఏపీలో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల మధ్య  53,026 శాంపిల్స్‌ని ( COVID-19 tests ) పరీక్షించగా.. అందులో 8,943 మందికి కరోనా సోకినట్టు నిర్దారణ అయ్యింది. అదే సమయంలో కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా రాష్ట్రంలో 97 మంది చనిపోయారు. జిల్లాల వారీగా మృతుల సంఖ్య విషయానికొస్తే.. కర్నూలు జిల్లాలో 12 మంది, చిత్తూరు జిల్లాలో 10 మంది, తూర్పు గోదావరిలో 10 మంది, గుంటూరు జిల్లాలో 10 మంది, , పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది, నెల్లూరు జిల్లాలో 10 మంది, అనంతపురం జిల్లాలో ఆరుగురు, కడప జిల్లాలో ఆరుగురు, ప్రకాశం జిల్లాలో ఆరుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు, విశాఖపట్నం జిల్లాలో ఆరుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు,  కృష్ణా జిల్లాలో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. Also read : SP Balasubrahmanyam: బాలు ఆరోగ్య పరిస్థితి విషమం.. హెల్త్ బులెటిన్ విడుదల

ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ( Health bulletin ) ప్రకారం.. గత 24 గంటల్లో 9,779 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,80,703కి చేరుకుంది. ఇప్పటివరకు ఏపీలో 27,58,485 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తం 2,73,085 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. Also read : Indraprastham: చంద్రబాబు, వైఎస్ఆర్ స్నేహంపై సినిమా టైటిల్ ఇదేనా ?

కరోనావైరస్ బారిన పడిన జిల్లాల్లో అత్యధికంగా 38,292 కరోనా పాజిటివ్ కేసులతో తూర్పు గోదావరి జిల్లా ముందుండగా అత్యల్పంగా  ప్రకాశం జిల్లాలో 10,763 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య విషయానికొస్తే... కర్నూలు జిల్లాలో 276 మంది కరోనాతో చనిపోగా.. ఆ తర్వాత అత్యధికంగా గుంటూరు జిల్లాలో 275, తూర్పు గోదావరి జిల్లాలో 258 మంది కరోనాతో చనిపోయారు. మొత్తంగా ఇప్పటివరకు ఏపీలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,475 కి చేరుకుంది. Also read : కరోనా నుంచి కోలుకుంటున్న యంగ్ హీరోయిన్

Trending News