కరోనా నుంచి కోలుకుంటున్న యంగ్ హీరోయిన్

కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచమంతా వ్యాపిస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖుల నుండి మొదలుకొని ధనిక, పేద అని తారతమ్యం లేకుండా అందరిని వరుసగా పలకరిస్తోంది.

Updated: Aug 14, 2020, 08:34 PM IST
కరోనా నుంచి కోలుకుంటున్న యంగ్ హీరోయిన్

కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచమంతా వ్యాపిస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖుల నుండి మొదలుకొని ధనిక, పేద అని తారతమ్యం లేకుండా అందరిని వరుసగా పలకరిస్తోంది. అలాగే ఇప్పుడు కృష్ణాష్టమి, మలుపు వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నిక్కి గల్రానీకి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. గొంతు నొప్పి, దగ్గు, రుచి, వాసన కోల్పోవడం వంటి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని గుర్తించి కరోనా టెస్ట్ ( COVID-19 tests ) చేయించుకోగా పాజిటివ్ అని నిర్దారణ అయిందని నటి నిక్కి గల్రానీ వెల్లడించింది. Also read : SP Balasubrahmanyam: బాలు ఆరోగ్య పరిస్థితి విషమం.. హెల్త్ బులెటిన్ విడుదల

గత వారమే తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని ఓ ట్వీట్ చేసిన నిక్కి గల్రానీ.. కరోనాను తరిమికొట్టేందుకు నిరంతర కృషి చేస్తున్న వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపింది. బుజ్జిగాడు, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో నటించిన నటి సంజన చెల్లెలే ఈ నిక్కి గల్రానీ. తెలుగులో మలుపు సినిమా చేసిన తర్వాత టాలీవుడ్‌లో ఆమెకు ఆఫర్స్ రాలేదు. దీంతో ఆమె మళ్లీ టాలీవుడ్ వైపు మల్లిచూడలేదు కానీ తమిళంలో మాత్రం వరుసగా చిత్రాలకు సైన్ చేస్తోంది. Also read : Kathi Mahesh: కత్తి మహేష్ అరెస్ట్.. రిమాండ్ విధించిన కోర్టు