TTD updates: తిరుమలలో శ్రీవారి దర్శనానికి కండిషన్స్ అప్లై

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అంటే ముందుగా గుర్తుకొచ్చేది నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో గుంపులు గుంపులుగా తరలివచ్చి శ్రీవారిని దర్శించుకోవడమే. కానీ ఇకపై అలాంటివి కుదరదని టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి (SV SubbaReddy) తెలిపారు.

Last Updated : May 2, 2020, 08:00 PM IST
TTD updates: తిరుమలలో శ్రీవారి దర్శనానికి కండిషన్స్ అప్లై

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అంటే ముందుగా గుర్తుకొచ్చేది నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో గుంపులు గుంపులుగా తరలివచ్చి శ్రీవారిని దర్శించుకోవడమే. కానీ ఇకపై అలాంటివి కుదరదని టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి (SV SubbaReddy) తెలిపారు. లాక్‌డౌన్ ఎత్తేసిన అనంతరం తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తామని చెప్పిన ఎస్వీ సుబ్బారెడ్జి.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా ఒకరికొకరు సోషల్ డిస్టెన్స్ (Social distance) పాటించాల్సిన అవసరం ఉంటుందని గుర్తుచేశారు. భక్తుల మధ్య సోషల్ డిస్టన్స్ లక్ష్యానికి భంగం కలగకుండా క్యూలైన్లలోనూ మార్పులుచేర్పులు ఉంటాయని ఎస్వీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. అందువల్లే ఇంతకుముందు తరహాలో భారీ సంఖ్యలో భక్తులకు దర్శనానికి అనుమతించడం కుదరదు అని ఆయన తేల్చిచెప్పారు. 

Also read : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతీ ఇంట్లో ఒకరికి కరోనా పరీక్ష

భారీ సంఖ్యలో భక్తులతో నిత్యం రద్దీగా ఉండే తిరుమలలో కరోనావైరస్ కట్టడి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు ఎస్వీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. దర్శనార్థం వచ్చే భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ (Thermal screening) చేయడంతో పాటు వారికి మాస్కులు (Masks), శానిటైజర్లు (Sanitizers) వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News