అమరావతి: ఏపీలో కరోనా వైరస్ నివారణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ (AP govt) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రతీ ఇంట్లో ఒకరికి కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలు (COVID-19 tests) నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగా కరోనా వైరస్ ప్రభావం తొలుత ఎక్కువగా ఉన్న రెడ్ జోన్ మండలాల్లో (Red zones in AP) ఈ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. శనివారం ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గుడ్లూరు గ్రామ వాలంటీర్లు (Grama volunteers) తమ పరిధిలోని 50 కుటుంబాలకు చెందిన ఒక్కొక్కరికి కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేయించారు. ఈ పరీక్షలకు సంబంధించిన రిపోర్ట్స్ మరో రెండు రోజుల్లో రానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు.
Also read : ఏపీలో 24గంటల్లో 62 కొత్త కేసులు
ఇదిలావుంటే, ఇప్పటివరకు ఏపీలో 1 లక్ష 8 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది. వారిలో మొత్తం 1,525 మందికి కరోనా పాజిటివ్ రాగా (COVID-19 cases in AP).. వారిలోనూ 33 మంది మరణించారు. జిల్లాల వారీగా మృతుల సంఖ్య విషయానికొస్తే.. కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా 10 మంది చనిపోగా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాల నుంచి 8 మంది చొప్పున ఉన్నారు. ఆ తర్వాత అనంతపురం జిల్లా నుంచి నలుగురు, నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,051 యాక్టివ్ కేసులు ఉండగా... మరో 441 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..