Apple iPhone 11 Flipkart: ఐఫోన్ 11పై భారీ తగ్గింపు.. రూ.12 వేలకే అందుబాటులో!

Apple iPhone 11 Flipkart: ఫ్లిప్ కార్ట్ లో మొబైల్స్ బొనాంజా సేల్ మీ ముందుకు వచ్చింది. ఈ సేల్ ద్వారా అనేక స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపు లభించనుంది. ఈ సేల్ లో రూ. 49,900 Apple iPhone 11 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు  రూ. 12,499 ధరకే లభించనుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 01:05 PM IST
Apple iPhone 11 Flipkart: ఐఫోన్ 11పై భారీ తగ్గింపు.. రూ.12 వేలకే అందుబాటులో!

Apple iPhone 11 Flipkart: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సంస్థలో వినియోగదారులను ఆకర్షించేందుకు మరో సరికొత్త సేల్ తో ముందుకు వచ్చింది. మొబైల్ బొనాంజా సేల్ పేరుతో ప్రారంభమైన ఈ సేల్ లో Apple, Samsung, Realme, Oppo, Vivo స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. Apple ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 11పై ప్రత్యేక తగ్గింపు అందుబాటులో ఉంది. రూ. 49,900 విలువైన ఐఫోన్ 11 ఇప్పుడు రూ. 12,499 ధరకే లభిస్తుంది. 

Apple iPhone 11పై ఆఫర్స్, డిస్కౌంట్..

Apple iPhone 11కు చెందిన 64 GB వేరియంట్ మార్కెట్‌లో రూ. 49,900గా ఉంది. అయితే ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 11 % తగ్గింపు తర్వాత రూ. 43,999కి విక్రయించబడుతోంది. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని కొనుగోలు చేసేటప్పుడు దాన్ని ఉపయోగిస్తే, మీరు 10% క్యాష్‌బ్యాక్ పొందుతారు. అంటే అత్యధికంగా రూ. 1,500 తగ్గింపు తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 42,499కు చేరుతుంది. 

ఈ డీల్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా అత్యధికంగా రూ. 30,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అనేక ఆఫర్లు, తగ్గింపుల తర్వాత Apple iPhone 11 వేరియంట్ రూ. 27,745 ధరకు పొందే అవకాశం ఉంది. 

Apple iPhone 11 ఫీచర్లు

1) స్టోరేజ్ - 64 GB వేరియంట్

2) డిస్ ప్లే - 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR

3) కెమెరా - 12 MP + 12 MP + 12 MP (ఫ్రంట్ కెమెరా)

4) బయోనిక్ చిప్ - A13 5G స్మార్ట్ ఫోన్ 

5) ఛార్జింగ్ - క్విక్ ఛార్జింగ్ సపోర్ట్, డ్యూయల్ సిమ్ సపోర్టింగ్ కలదు.  

Also Read: Whatsapp Digilocker: ఇకపై మీతో ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు!

Also Read: Mini AC Cooler: అమెజాన్ లో రూ.6 వేలకే అందుబాటులో పోర్టబుల్ ఏసీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News