Whatsapp Digilocker: ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మనం వినియోగించే వాహనాలకు సంబంధించిన పేపర్స్ తీసుకెళ్లడం చాలా మంది మర్చిపోతుంటారు. అలాంటి సమస్యలకు ప్రభుత్వం ఇప్పుడు బ్రేక్ వేసింది. వాట్సాప్ వినియోగదారుల కోసం సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. దీన్ని ఉపయోగించి మీరు మీ మొబైల్‌లోనే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సహా అనేక పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మీ పత్రాలను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
1) ముందుగా మీరు +91 9013151515 నంబర్‌కు నమస్తే, హలో లేదా హాయ్ లేదా డిజిలాకర్ కి మెసేజ్ పంపాలి.
2) దీని తర్వాత మీరు DigiLocker ఖాతా లేదా Cowin సేవను యాక్సెస్ చేయాలా అని అడుగుతారు.
3) మీరు డిజిలాకర్‌ని ఎంచుకుంటే, మీకు ఖాతా ఉందా లేదా అని అడుగుతారు.
4) డిజిలాకర్‌లో ఇప్పటికే ఖాతా ఓపెన్ చేసి ఉంటే.. దానికి మీ ఆధార్ నంబర్ ను నమోదు చేయాల్సి ఉంటుంది.
5) దీని తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేయావల్సి ఉంటుంది.
6) ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత మీరు మీ పత్రాలను డిజిలాకర్‌కు అప్‌లోడ్ చేయవచ్చు.
7) అయితే మీరు ఇప్పటికే మీ పత్రాలను అప్‌లోడ్ చేసి ఉంటే, మీరు వాటిని అందులో నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏ ఏ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు?
డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బీమా (ఇన్సూరెన్స్) సర్టిఫికేట్, పాన్ కార్డ్, CBSE 10th - 12th సర్టిఫికేట్, జీవిత బీమా (లైఫ్ ఇన్సూరెన్స్) సర్టిఫికేట్‌లను WhatsApp ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరో విధంగా చెప్పాలంటే, ఇకపై మీ సర్టిఫికేట్స్ ను మీ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారా MyGov హెల్ప్‌డెస్క్‌కి సందేశం పంపడం ద్వారా మీకు కావలసినప్పుడు ఈ పత్రాలను మీ మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read: 786 Currency Note Sale: మీ దగ్గర ఈ కరెన్సీ నోట్లు ఉంటే రాత్రికి రాత్రే లక్షాధికారి అవ్వొచ్చు!
Also Read: Smartphone Tips: స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎట్టిపరిస్థితుల్లో ఈ తప్పులు చేయకండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook