Credit Cards Limit Reduction: మీ క్రెడిట్ కార్డు లిమిట్ భారీగా కట్ అయిందా ? ఐతే రిస్కే

Credit Cards Limit Reduction: మీ క్రెడిట్ కార్డులో ఉన్నట్టుండి క్రెడిట్ లిమిట్ తగ్గిపోయిందా ? మీకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండానే బ్యాంక్ క్రెడిట్ కార్డులో లిమిట్ తగ్గించిందా ? అది తెలియకుండానే షాపింగ్‌కి వెళ్లి ఇబ్బందులు పడ్డారా ? మీకే కాదు.. కరోనా తరువాతి కాలంలో చాలామందికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైన సందర్భాలు ఉన్నాయి.

Written by - Pavan | Last Updated : Aug 18, 2023, 05:09 PM IST
Credit Cards Limit Reduction: మీ క్రెడిట్ కార్డు లిమిట్ భారీగా కట్ అయిందా ? ఐతే రిస్కే

Credit Cards Limit Reduction: మీ క్రెడిట్ కార్డులో ఉన్నట్టుండి క్రెడిట్ లిమిట్ తగ్గిపోయిందా ? మీకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండానే బ్యాంక్ క్రెడిట్ కార్డులో లిమిట్ తగ్గించిందా ? అది తెలియకుండానే షాపింగ్‌కి వెళ్లి ఇబ్బందులు పడ్డారా ? మీకే కాదు.. కరోనా తరువాతి కాలంలో చాలామందికి ఇలాంటి చేదు అనుభవం ఎదురైన సందర్భాలు ఉన్నాయి. స్టాక్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ( సెబి ) సర్టిఫైడ్ టాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్ జితేంద్ర సోలంకి వెల్లడించిన వివరాల ప్రకారం.. కస్టమర్ల రీపేమెంట్స్ హిస్టరీతో పాటు వారి ఆదాయ మార్గాల ఆధారంగా వారికి ఉండే క్రెడిట్ కెపాసిటీని విశ్లేషించే హక్కు బ్యాంకులకు ఉంది. అందుకే బ్యాంకులే సొంతంగా మీ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించి క్రెడిట్ కార్డుపై క్రెడిట్ లిమిట్ పెంచడం లేదా తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చాలా వరకు బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ విషయాన్ని మెసేజ్ రూపంలో కస్టమర్లకు సమాచారం అందిస్తున్నాయి.

ఎస్బీఐ క్రెడిట్ కార్డు కస్టమర్ల నుండి దీనిపై చాలా ఫిర్యాదులు వెలుగులోకొచ్చాయి. అయితే, ఆ తరువాతే తెలిసింది ఏంటంటే.. ఇలా క్రెడిట్ కార్డులపై క్రెడిట్ లిమిట్ తగ్గించిన బ్యాంకు కేవలం ఎస్బీఐ ఒక్కటే కాదు.. గతంలో హెచ్ డి ఎఫ్ సి, ఆర్ బి ఎల్ వంటి బ్యాంకులు కూడా కస్టమర్ల క్రెడిట్ లిమిట్ తగ్గించిన బ్యాంకుల జాబితాలో ఉన్నాయి. 

బ్యాంకులు క్రెడిట్ లిమిట్ తగ్గించడానికి గల కారణాలు అనేకం ఉంటాయి. అందులో ప్రధామైనవి ఏంటనేది ఇప్పుడు ఒక లుక్కేద్దాం..
డీఫాల్ట్ కేసులు :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం 2023 మార్చి నెల చివరి నాటికి క్రెడిట్ కార్డ్ డిఫాల్టర్ల సంఖ్య గణనీయంగా పెరిగి 1.94% కి చేరుకుంది. అలాగే క్రెడిట్ కార్డులపై ఉన్న ఔట్‌స్టాండింగ్ బిల్లులు కూడా మార్చి 2022లో రూ. 1.64 లక్షల కోట్లుగా ఉండగా.. 2022- 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ. 2.10 లక్షల కోట్లకు పెరిగాయి. డిఫాల్ట్ అయిన కేసుల పెరుగుదల, అలాగే క్రెడిట్ కార్డ్ బిల్లుల సకాలంలో చెల్లించకపోవడం వంటి అంశాలు క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపిస్తాయి. ఈ కారణంగానే క్రెడిట్ కార్డులపై క్రెడిట్ లిమిట్‌ని తగ్గిస్తూ బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయి.

2. మూడు నెలలకు పైగా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకపోతే : 
మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించని వారి క్రెడిట్ హిస్టరీని బ్యాంకులు తీవ్రంగా పరిగణిస్తాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ అందించిన ఒక నివేదిక ప్రకారం గత జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించని వారి సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. మూడు నెలల పాటు క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకపోవడం వల్ల వారిపై అపరాదరుసుం కూడా పెరుగుతుంది. క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించలేకపోవడం అంటే అది వారి ఆదాయం కూడా తగ్గినట్టుగానే బ్యాంకులు భావించే అవకాశం ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకునే బ్యాంకులు సదరు కస్టమర్ల క్రెడిట్ లిమిట్ తగ్గించేస్తుంటాయి.

3. అధిక వినియోగం : 
బ్యాంకులు ప్రధానంగా పరిగణనలోకి తీసుకునే అంశాల్లో క్రెడిట్ యూసేజ్ రేషియో కూడా ఒకటి. అంటే క్రెడిట్ లిమిట్ అధిక వినియోగ నిష్పత్తి అన్నమాట. ఇంకా చెప్పాలంటే.. మీకు క్రెడిట్ కార్డుపై ఉన్న క్రెడిట్ లిమిట్‌లో మీరు ఎంత ఎక్కువ వినియోగించుకుంటున్నారో.. మీ క్రెడిట్ యూసేజ్ రేషియో అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. క్రెడిట్ లిమిట్‌లో ఎక్కువగా వినియోగించుకునే వారి ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని బ్యాంకులు భావిస్తుంటాయి. ఉదాహరణకు, మీ క్రెడిట్ కార్డుపై రూ. 1 లక్ష క్రెడిట్ లిమిట్ ఉందనుకోండి. అందులోంచి మీరు 30 - 40% ఖర్చు చేస్తే మీరు స్మార్ట్ యూజర్ అవుతారు. అలాకాకుండా 70% లేదా అంతకంటే ఎక్కువ ఖర్చుచేసే వారు బ్యాంకుల దృష్టిలో రిస్కీ కస్టమర్స్ అవుతారు. అలా క్రెడిట్ కార్డును మొత్తం వినియోగించే వారి క్రెడిట్ లిమిట్ ని బ్యాంకులు తగ్గిస్తుంటాయి.

ఇది కూడా చదవండి : Hyundai Cars Discount Mela: కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. హ్యూందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్

4. క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగించకపోవడం : 
బ్యాంకుల దృష్టిలో క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా ఉపయోగించడం ఎలాగైతే రిస్కో.. అలాగే అస్సలే ఉపయోగించకుండా పక్కన పెట్టేయడం కూడా ఒక రకంగా బ్యాంకుకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. క్రెడిట్ కార్డు ఉపయోగించే వారి నుంచే బ్యాంకులకు ఏదో ఒక రూపంలో తిరిగి ఆదాయం లభిస్తుంటుంది. అసలు క్రెడిట్ కార్డు ఉపయోగించని వారితో బ్యాంకులకు ఎలాంటి ప్రయోజనం లేదు. వార్షికంగా వచ్చే యాన్వల్ ఫీజు తప్పించి వారి నుండి బ్యాంకులకు పెద్దగా ఆదాయం ఉండదు. అందుకే వారి కార్డులో ఉన్న క్రెడిట్ లిమిట్‌ని తగ్గించి క్రెడిట్ స్కోర్ మెరుగ్గాఉన్న మరొక కస్టమర్‌కి ఆ క్రెడిట్ లిమిట్‌ని పెంచుతుంటాయి. అంటే క్రెడిట్ కార్డు వినియోగించని వారి వద్ద కోల్పోయిన ఆదాయాన్ని అక్కడ రాబట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఇలాంటి సందర్భంలోనూ క్రెడిట్ కార్డు వినియోగించకుండా ఇన్ యాక్టివ్‌గా ఉంచే వారి క్రెడిట్ లిమిట్ తగ్గే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి : Tata Electric Cars: 1 లక్ష ఎలక్ట్రిక్ కార్లు అమ్మిన టాటా మోటార్స్‌.. ఎలాగంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News