Tata Electric Cars: 1 లక్ష ఎలక్ట్రిక్ కార్లు అమ్మిన టాటా మోటార్స్‌.. ఎలాగంటే..

Tata Electric Cars: 1 లక్ష ఎలక్ట్రిక్ కార్లు విక్రయించడం కోసం టాటా మోటార్స్ కంపెనీకి ఐదేళ్ల కాలం పట్టింది. మొదటి 10,000 యూనిట్ల అమ్మకానికి 44 నెలల సమయం పడితే.. తరువాత 40,000 కార్లు అమ్మడానికి కేవలం 15 నెలలే పట్టింది. ఇక చివరి 50,000 కార్ల అమ్మకానికి కేవలం 9 నెలల సమయమే పట్టింది.

Written by - Pavan | Last Updated : Aug 13, 2023, 11:22 PM IST
Tata Electric Cars: 1 లక్ష ఎలక్ట్రిక్ కార్లు అమ్మిన టాటా మోటార్స్‌.. ఎలాగంటే..

Tata Electric Cars: ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాప్ ర్యాంక్‌లో దూసుకుపోతున్న టాటా మోటార్స్ కంపెనీ మరో ఘనత సాధించింది. ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణి అమ్మకాల్లో 1 లక్ష వాహనాలు విక్రయించడం ద్వారా టాటా మోటార్స్ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దీంతో ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికిల్స్ సెక్టార్ లో అగ్రెసివ్ గా ఉన్న టాటా మోటార్స్ కి ఈ రేర్ అచీవ్ మెంట్ మరింత బూస్టింగ్ ఇచ్చినట్టయింది. టాటా టిగోర్ ఈవి, టాటా టియాగో ఈవి, టాటా నెక్సాన్ ఈవీ వంటి మోడల్స్ టాటా మోటార్స్ ఈ ఖ్యాతి పొందేందుకు సేల్స్ రూపంలో తమ వంతు పాత్ర పోషించాయి.

1 లక్ష ఎలక్ట్రిక్ కార్లు విక్రయించడం కోసం టాటా మోటార్స్ కంపెనీకి ఐదేళ్ల కాలం పట్టింది. మొదటి 10,000 యూనిట్ల అమ్మకానికి 44 నెలల సమయం పడితే.. తరువాత 40,000 కార్లు అమ్మడానికి కేవలం 15 నెలలే పట్టింది. ఇక చివరి 50,000 కార్ల అమ్మకానికి కేవలం 9 నెలల సమయమే పట్టింది.

టాటా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల విషయంలో సాధించిన ఘనత పట్ల ఆ కంపెనీ సైతం ఆశ్చర్యంగానే ఉంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ , టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర మాటల్లో ఆ విషయం అర్థం అవుతోంది. శైలేష్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ కారు విషయంలో తొలుత కస్టమర్స్ కి చాలా సందేహాలు, అపొహలు ఉండేవి కానీ తరువాత తరువాత వారి మైండ్‌సెట్ చాలా వేగంగా మారుతూ వచ్చింది. అలా జనం ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారని.. దీనికి మౌత్ పబ్లిసిటీ కూడా తోడు అవడం, కస్టమర్లలో టాటా మోటార్స్‌పై విశ్వాసం ఏర్పడటం వంటివి అన్నీ కారణాలుగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మొదట్లో ఎలక్ట్రిక్ కార్లు అంటే సెకండరీ యూజ్‌గానే చూసే వారు కానీ ఇప్పుడు ప్రైమరీ యూజ్‌గా ఎలక్ట్రిక్ కార్లని వినియోగిస్తున్నారు అని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర అభిప్రాయపడ్డారు. 

రెగ్యులర్ వాహనాలపై విధించే జీఎస్టీ, రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు లాంటి అదనపు బాదుడు లేకుండా ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ మన కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ ప్రోత్సాహకాలు అందించడంతో కొత్తగా కార్లు కొనుగోలు చేసే కస్టమర్స్ ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. ఈ విషయంలో ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయి అని శైలేష్ చంద్ర తెలిపారు. 

ఇది కూడా చదవండి : Top Most Selling SUV cars in India : ఇండియాలో అత్యధికంగా సేల్ అయ్యే టాప్ 10 SUV కార్ల జాబితా

టాటా మోటార్స్ సాధించిన ఈ విజయంలో ముందు చెప్పుకున్నట్టుగా టాటా టియాగో, టాటా టిగోర్, టాటా నెక్సాన్ వంటి మోడల్స్ కీలక పాత్ర పోషించాయి. కొత్తగా టాటా నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్, టాటా హారియర్ EV, టాటా పంచ్ EV, టాటా కర్వ్ EVలతో ఒకే ఏడాదిలో నాలుగు కొత్త EVలను కస్టమర్లకు పరిచయం చేయడానికి టాటా మోటార్స్ ప్లాన్ చేస్తోంది. అందుకు సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరిగిపోతున్నాయి. ఈ నాలుగు ఎలక్ట్రిక్ వెహికిల్స్ రాకతో టాటా మోటార్స్ బిజినెస్ మరింత పుంజుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : Tata Punch iCNG: టాటా పంచ్ iCNG కారు వచ్చేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News