Indian Exports: 2021-22లో భారత స్మార్ట్​ఫోన్ల ఎగుమతులు 83 శాతం జంప్​!

Indian Exports: మేడ్​ ఇండియా స్మార్ట్​ఫోన్ల ఎగుమతులు భారీగా పెరిగుతున్నాయి. ఓ నివేదిక ప్రకారం.. 2020-21తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు 83 శాతం పెరిగే అవకాశముంది. ఆ నివేదికలోని మరిన్ని కీలక విషయాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 26, 2022, 05:11 PM IST
  • పెరుగుతున్న మేడ్ ఇన్​ ఇండియా ఫోన్ల ఎగుమతులు
  • 2021-22లో 83 శాతం వృద్ధి చెందే అవకాశం..
  • తాజా నివేదికలో కీలక విషయాలు వెల్లడి
Indian Exports: 2021-22లో భారత స్మార్ట్​ఫోన్ల ఎగుమతులు 83 శాతం జంప్​!

Indian Exports: ఇండియా నుంచి స్మార్ట్​ఫోన్ల ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) దేశీయ స్మార్ట్ ఫోన్ ఎగుమతులు 83 శాతం పెరగొచ్చని అంచనాలు వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం రూ.42 వేల కోట్ల విలువైన స్మార్ట్​ఫోన్ ఎగుమతులు జరిగాయని ప్రముఖ వార్తా సంస్థ టైమ్స్​ ఆఫ్ ఇండియా తాజా కథనంలో పేర్కొంది.

ఈ కథనం ప్రకారం.. 2020-21లో, కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన సంక్షోభం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింది. మైక్రోచిప్​ల కొరత కారణంగా స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు భారీగా తగ్గాయి. చిప్​ల కొరత ఇంకా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. గడిచిన నాలుగేళ్లలో దేశీయ స్మార్ట్​ఫోన్​ ఎగుమతులు 32 శాతం పెరిగాయని తేలింది.

నాలుగేళ్ల కిందట ఇలా..

2017-18లో స్మార్ట్​ఫోన్ ఎగుమతుల విలువ రూ.1,300 కోట్లుగా ఉన్నట్లు తేలింది. కేవలం నాలుగేళ్లలో ఈ విలువ రూ.42,000లకు చేరడం విశేషం.

గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రూ.42 వేల కోట్ల ఎగుమతులు నమోదవగా అందులో రూ.20 వేల కోట్ల విలువైన ఎగుమతులు కేవలం శాంసంగ్​ ఫోన్లకు,  రూ.12,000 వేల కోట్ల విలువైన ఎగుమతులు యాపిల్​ ఐఫోన్లకు సంబంధించినవే కావడం గమనార్హం.

డిమాండ్ పెరిగేందుకు కారణాలు..

'కరోనా విషయంలో చైనాపై వచ్చిన వ్యతిరేకత, భారత్ చైనా మధ్య జరిగిన గల్వాన్ ఘటన తర్వాత.. దేశీయంగా భారీ మార్పులు వచ్చాయి. ముఖ్యంగా స్మార్ట్​ఫోన్ తయారీదారులకు.. తయారీ ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్​ఐ) ప్రకటించడం వంటి చర్యలతో భారత్​లో ఉత్పత్తి భారీగా పెరిగింది. భారత్​లో ఉత్పత్తయిన వివిధ కంపెనీల ఫోన్లకు దక్షిణాసియా, ఐరోపాల నుంచి డిమాండ్ పెరిగింది. దీనితో ఎగుమతులు ఈ స్థాయిలో పుంజుకున్నాయి.' అని ఇండియన్​ సెల్యులార్​ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) నివేదిక తెలిపింది.

Also read: EPFO E-nomination: ఈ-నామినేషన్ దాఖలు అవసరం ఎంత? చేయకుంటే ఏమౌతుంది?

Also read: Petrol Price Today: మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డిజీల్‌ ధరలు.. ఐదు రోజుల్లో రూ. 3.10 పెరిగిన పెట్రోల్‌ రేట్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News