Flipkart UPI: ఫ్లిప్‌కార్ట్ నుంచి కొత్తగా యూపీఐ సేవలు ప్రారంభం.. ఇలా చేయండి

Flipkart UPI Services: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో ఎంట్రీ ఇచ్చింది. యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యంతో యూపీఐ సేవలు ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్ నిన్న ఆదివారం నాడు యూపీఐ సేవలు లాంచ్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 5, 2024, 09:37 AM IST
Flipkart UPI: ఫ్లిప్‌కార్ట్ నుంచి కొత్తగా యూపీఐ సేవలు ప్రారంభం.. ఇలా చేయండి

Flipkart UPI Services: వాల్‌మార్ట్ కంపెనీ ఫ్లిప్‌‌కార్ట్ కొత్తగా యూపీఐ సర్వీసెస్ ప్రారంభించింది. ఈ కామర్స్‌లో ఫ్లిప్‌కార్ట్ ప్రత్యర్ధిగా ఉన్న అమెజాన్ ఇప్పటికే యూపీఐ, పేమెంట్స్ బ్యాంక్ ఇతర సేవలు అందిస్తుండగా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ కూడా పోటీకు దిగుతోంది. ఫ్లిప్‌కార్ట్ యపీఐ సేవల్ని యాక్సిస్ బ్యాంక్ సహకారంతో ప్రారంభించింది. ప్రస్తుతానికి కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులో ఉండగా, త్వరలో ఐవోఎస్ యూజర్లకు అందుబాటులో రానుంది. 

ఫ్లిప్‌కార్ట్‌కు ప్రధాన ప్రత్యర్ధి అయిన అమెజాన్ ఇప్పటికే పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే సంస్థలు అందిస్తున్న అన్ని సేవలు అందిస్తోంది. ఏడాది నుంచి ఫ్లిప్‌కార్ట్ యూపీఐ సేవల ట్రయల్స్‌లో ఉంది. @fkaxis పేరుతో యూపీఐ హ్యాండిల్ ఉంటుందని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా ఇక నుంచి నేరుగా చెల్లింపులు జరుపుకోవచ్చు. ప్లిప్‌కార్ట్ ప్రారంభించిన ఈ యూపీఐతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్ లో నేరుగా లావాదేవీలు జరుపుకోవచ్చు. సొంతంగా యూపీఐ ప్రారంభించడం ద్వారా కస్టమర్లకు మరింత మెరుగైన షాపింగ్, పేమెంట్ సౌకర్యం కల్పించాలనేది ఫ్లిప్‌కార్ట్ ఆలోచనగా ఉంది. అంతేకాకుండా రీఛార్జ్, బిల్ పేమెంట్స్ విషయంలో ఫాస్ట్ సర్వీసెస్ అందించనుంది.

అయితే అమెజాన్ ఇప్పటికే యూపీఐ చెల్లింపులు, పేమెంట్స్ బ్యాంక్ రంగంలో పాతుకుపోయి ఉన్నందున ఫ్లిప్‌కార్ట్‌కు గట్టి సవాలు ఎదురుకావచ్చు. యూపీఐ మార్కెట్‌లో ఇప్పటికే పేటీఎం, ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పేలు స్థిరంగా ఉన్నాయి. ఈ నాలుగు సంస్థలు కాకుండా పలు ఇతర బ్యాంక్ యూపీఐలు కూడా ఉన్నాయి. అందుకే ప్లిప్‌కార్ట్ ప్రారంభించిన యూపీఐకు మార్కెట్‌లో గట్టి పోటీనే ఉంటుంది. 

Also read: 7th Pay Commisson: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, డీఏ పెంపు మార్చ్ నుంచే, భారీగా జీతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

 

Trending News