వరుసగా రెండవరోజు తగ్గిన బంగారం ధర, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి ధరలు

పసిడి ప్రియులకు మరో గుడ్‌న్యూస్. వరుసగా రెండవరోజు బంగారం ధర ఆశించినమేర తగ్గింది. మొన్నటి వరకూ పెరుగుతూపోయిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడం విశేషం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 25, 2021, 07:46 AM IST
  • దేశవ్యాప్తంగా మరోసారి తగ్గిన బంగారం ధర
  • దేశవ్యాప్తంగా ఇవాళ పది గ్రాముల బంగారంపై 360 రూపాయల వరకూ తగ్గుదల
  • దేశంలో ఢిల్లీలో అత్యధిక ధర పలుకుతున్న బంగారం
వరుసగా రెండవరోజు తగ్గిన బంగారం ధర, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి ధరలు

పసిడి ప్రియులకు మరో గుడ్‌న్యూస్. వరుసగా రెండవరోజు బంగారం ధర ఆశించినమేర తగ్గింది. మొన్నటి వరకూ పెరుగుతూపోయిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడం విశేషం.

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ మారుతుంటాయి. మొన్నటి వరకూ పెరుగుతూపోయిన బంగారం ధరలు నిన్నటి నుంచి తగ్గుముఖం పట్టాయి. నిన్న తులం బంగారంపై దాదాపు 12 వందలకు పైగా తగ్గడంతో పసిడి ప్రియులకు ఊరట కలిగింది. ఇవాళ వరుసగా రెండవరోజు కూడా బంగారం ధర పదిగ్రాములకు(Gold Price Today) మరో 360 రూపాయలవరకూ తగ్గింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గడం విశేషం. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో(Delhi Gold Price) 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 850 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 100 రూపాయలుగా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 630 రూపాయలు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 47 వేల 630 గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49 వేల 90 గా ఉంది. ఇక మరో ముఖ్య నగరం కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 100  రూపాయలైతే.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 800 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44 వేల 700 కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 760 రూపాయలుంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44 వేల 700 కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 760 రూపాయలుగా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు దాదాపుగా ఒకేలా ఉన్నాయి. హైదరాబాద్(Hyderabad Gold Price)లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 44 వేల 700 కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 760 రూపాయులుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 44 వేల 700 అయితే.. 24 క్యారెట్ల  బంగారం పది గ్రాముల ధర 48 వేల 760 గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

Also read: Free insurance offers: మీ వద్ద డెబిట్ కార్డ్ లేదా Credit card ఉందా ? అయితే ఫ్రీ ఇన్సూరెన్స్ ఆఫర్ ఉన్నట్టేనట!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News