Free insurance offers: మీ వద్ద డెబిట్ కార్డ్ లేదా Credit card ఉందా ? అయితే ఫ్రీ ఇన్సూరెన్స్ ఆఫర్ ఉన్నట్టేనట!

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు అందించే ఏటీఎం లేదా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో (Debit cards or credit cards) ఉచితంగా.. అంటే కాంప్లిమెంటరీ ఆఫర్స్ కింద ప్రమాదాల్లో మరణించినప్పుడు జీవిత బీమా లేదా ప్రమాదాల సమయంలో శాశ్వత అంగవైకల్యం బారినపడినప్పుడు ఆ ఖర్చులు భరించేందుకు వీలుగా ఉచితంగా ఇన్సూరెన్స్ కవర్ కూడా అందిస్తుంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2021, 08:12 PM IST
  • చాలా మందికి తెలియని ఆసక్తికరమైన విషయం ఏంటంటే..
  • ఇన్సూరెన్స్ పాలసీ లేకున్నా.. కాంప్లిమెంటరీ కింద ఇన్సూరెన్స్ కవర్స్
  • ఇన్సూరెన్స్ లేకున్నా.. ఉచితంగా క్లెయిమ్ చేసుకోవడం ఎలా ?
Free insurance offers: మీ వద్ద డెబిట్ కార్డ్ లేదా Credit card ఉందా ? అయితే ఫ్రీ ఇన్సూరెన్స్ ఆఫర్ ఉన్నట్టేనట!

Free insurance with debit or credit cards: కరోనావైరస్ మహమ్మారి గత రెండేళ్ల కాలంలో అనేక మందిని బలి తీసుకుంది. కరోనావైరస్ అని మాత్రమే కాకుండా ఊహించని రోడ్డు ప్రమాదాలు కూడా ఎంతో మంది చావుకు కారణమవుతున్నాయి. కారణాలు ఏవైనా.. ఊహించని విధంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంకా పడుతూనే ఉన్నాయి. ఇంకెన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో భారంగా బతుకీడుస్తున్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ (Life insurance schemes) ఉన్న వాళ్ల కుటుంబసభ్యులు, నామినిలు ఆ ఇన్సూరెన్స్ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకుని కొంతలో కొంత భారాన్ని తగ్గించుకోగలిగారు. 

అయితే, అందరూ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఉండరు కదా!! మరి అలాంటి కుటుంబాల పరిస్థితి ఏంటనేదే చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకున్నా.. మీ వద్ద డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు ఉన్నా చాలు.. ఎంతో కొంత మొత్తాన్ని ఇన్సూరెన్స్ కవర్ (Insurance cover) కింద ఉచితంగా అందుకోవచ్చనే సంగతి చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ విషయమే తెలుసుకుందాం రండి.

Also read : Bank Holidays in December 2021: డిసెంబర్‌లో ఏకంగా 16 రోజులు బ్యాంకులకు సెలవులు.. అవేంటో మీరే చూడండి!

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు అందించే ఏటీఎం లేదా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో (Debit cards or credit cards) ఉచితంగా.. అంటే కాంప్లిమెంటరీ ఆఫర్స్ కింద ప్రమాదాల్లో మరణించినప్పుడు జీవిత బీమా లేదా ప్రమాదాల సమయంలో శాశ్వత అంగవైకల్యం బారినపడినప్పుడు ఆ ఖర్చులు భరించేందుకు వీలుగా ఉచితంగా ఇన్సూరెన్స్ కవర్ కూడా అందిస్తుంటాయి. బ్యాంక్ అకౌంట్ లేదా క్రిడెట్ కార్డు కేపబిలిటీ ఆధారంగా ఒక్కోసారి ఈ ఫ్రీ ఇన్సూరెన్స్ కవర్ కింద క్లెయిమ్ చేసుకునే మొత్తం రూ. 50 వేల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 2021 వరకు దేశంలో మొత్తం 92 కోట్ల డెబిట్ కార్డులు (ATM cards) జారీ అయ్యాయి. ఇవే కాకుండా క్రెడిట్ కార్డులు కూడా ఉండనే ఉన్నాయి. వీటిలో చాలా కార్డులపై ఉచితంగా కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవర్ సౌకర్యం ఉండే ఉంటుంది అనేది ఒక అంచనా. ఇక ఉచితంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి బ్యాంకులు విధించే ప్రధానమైన షరతు (Bank rules) ఏంటంటే.. ఘటన జరగడానికి ముందుగా గత 90 రోజులలో సదరు కస్టమర్ కనీసం ఒక్క లావాదేవీలైనా జరిపి ఉండాలి.

Also read : Bumper Offers on TVs : రూ. 19,900 ధర గల Samsung 32-ఇంచెస్ TV.. కేవలం రూ. 5,240కే.. త్వరపడండి!

అంటే, ఘటన జరగడానికంటే ముందుగా ఏటీఎం సెంటర్లో లేదా ఎవరైనా మర్చంట్ వద్ద కానీ లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో (Online transactions) కానీ ఆ కార్డును ఉపయోగించి చెల్లింపులు జరిపి ఉండాలి అన్నమాట. ఒకవేళ ఏదైనా లావాదేవీలు జరిపిన 90 రోజుల తర్వాత ఘటన జరిగినట్టయితే, అలాంటి సందర్భాల్లో క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే.. ఒకవేళ ఇన్సూరెన్స్ కవర్ ఉండి, ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ (Life insurance policy) కోసం దరఖాస్తు చేసుకున్నట్టయితే, ఆ క్లెయిమ్‌తో సంబంధం లేకుండానే కార్డుల ఆధారంగా వచ్చే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా చేసుకునేందుకు అవకాశం ఉంది.

Also read : SBI Extra Transaction Charges: ఎస్బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. డిజిటల్ లావాదేవీలపై అదనపు ఛార్జీలు లేవు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News