ICICI Bank Discounts: మీకు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ ఉందా ? ఐతే ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మీ కోసమే

ICICI Bank Cashbacks And Discount Offers: ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ వంటి ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజాలు ఫెస్టివల్ సేల్ ప్రకటించిన నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ తమ కస్టమర్స్ కోసం క్యాష్ బ్యాక్ పేరిట భారీ ఆఫర్స్ తీసుకొచ్చింది. ఇది కేవలం అమేజాన్ సేల్ లేదా ఫ్లిప్‌కార్ట్ సేల్‌కి మాత్రమే పరిమితం కాదు.. టాటా న్యూ, మింత్ర సేల్‌కి సైతం వర్తిస్తుంది.

Written by - Pavan | Last Updated : Oct 7, 2023, 10:47 PM IST
ICICI Bank Discounts: మీకు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ ఉందా ? ఐతే ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ మీ కోసమే

ICICI Bank Cashbacks And Discount Offers: ఈ పండగల సీజన్ లో మీ ఇంట్లోకి కొత్త కొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయెన్సెస్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తు సామాగ్రి కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా ? మీ వద్ద ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ కార్డు ఉందా ? ఐతే మీ కోసం ఐసిఐసిఐ బ్యాంక్ ఫెస్టివల్ బొనాంజ తీసుకొచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ వంటి ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజాలు ఫెస్టివల్ సేల్ ప్రకటించిన నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ తమ కస్టమర్స్ కోసం క్యాష్ బ్యాక్ పేరిట భారీ ఆఫర్స్ తీసుకొచ్చింది. ఇది కేవలం అమేజాన్ సేల్ లేదా ఫ్లిప్‌కార్ట్ సేల్‌కి మాత్రమే పరిమితం కాదు.. టాటా న్యూ, మింత్ర సేల్‌కి సైతం వర్తిస్తుంది. 

ఔను అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర, టాటా న్యూ వంటి వివిధ షాపింగ్ పోర్టల్స్‌లో వివిధ కేటగిరిలలో ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేయడం ద్వారా కనీసం రూ. 26 వేల వరకు క్యాష్‌బ్యాక్ రూపంలో పొదుపు చేసుకునే అవకాశాన్ని ఐసిఐసిఐ బ్యాంక్ అందిస్తోంది. దసరా పండగ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ నుండి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, అమేజాన్ నుండి అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, మింత్ర నుండి మింత్ర బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్, టాటా న్యూ నుండి టాటా న్యూ ది గ్రాండ్ సేల్ పేరిట షాపింగ్ ఉత్సవాలు పోటాపోటీగా ఆఫర్స్ అందిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌కి తోడు ఐసిఐసిఐ బ్యాంక్ సైతం ఎట్రాక్టివ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అందిస్తోంది. 

ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్, ఫ్యాషన్, జువెలరీ, ఫర్నిచర్, హోమ్ అప్లయెన్సెస్.. ఇలా ఏది కొన్నా అన్నింటిపై ఎట్రాక్టివ్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ రెడీ అంటోంది ఐసిఐసిఐ బ్యాంక్. ఇవేకాకుండా ఐఫోన్, మేక్ మై ట్రిప్, టాటా న్యూ, వన్ ప్లస్, హెచ్‌పి మైక్రోసాఫ్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఎల్జీ, సోనీ, శాంసంగ్, తనిష్క్, తాజ్ వంటి సంస్థలతోనూ ఐసిఐసిఐ బ్యాంక్ టయప్ అయింది. 

ఎలక్ట్రానిక్స్ : 
ఎల్జీ, శాంసంగ్, సోని, యురేకా ఫోర్బ్స్ వంటి ప్రధాన ఎలక్ట్రానిక్ బ్రాండ్స్ పై కస్టమర్స్ కి రూ. 26,000 వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్స్ లభిస్తున్నాయి. బోస్ స్పీకర్లపై 25 శాతం వరకు ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. ఎంపిక చేసిన JBL సౌండ్ బార్స్, స్పీకర్స్‌పై రూ. 12,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్‌లో ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. 

మొబైల్ ఫోన్స్ : 
యాపిల్, వన్‌ప్లస్, మోటోరోలా, ఒప్పో, షావోమి, రియల్‌మి మొబైల్ ఫోన్స్ పై డిస్కౌంట్ ఆఫర్స్, ఈఎంఐ ఆఫర్స్ లభిస్తున్నాయి. కేవలం రూ. 2,497 ల ఇఎంఐతో ఇటీవలే లాంచ్ అయిన ఐఫోన్ 15 సైతం సొంతం చేసుకోవచ్చు. 

ఫ్యాషన్ : 
ఫ్యాషన్ అంటే ఇష్టపడే వారికి లైఫ్‌స్టైల్, ఫాస్ట్రాక్, మింత్రా వంటి ఫేమస్ బ్రాండ్స్ కి చెందిన ఉత్పత్తులపై 10 శాతం డిస్కౌంట్ పొందే వీలు కూడా ఉంది.  

ట్రావెల్ :  
వచ్చేది ఎలాగూ పండగల సీజన్ కావడంతో ఈ సెలవుల్లో మేక్ మై ట్రిప్, యాత్ర, క్లీయర్ ట్రిప్, ఈజ్ మై ట్రిప్ వంటి ఫేమస్ ట్రావెల్ వెబ్‌సైట్‌లలో టికెట్స్, హోటల్ బుకింగ్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

డైనింగ్ : 
జొమాటో, స్విగ్గి, ఈజీ డైనర్, మెక్‌డొనాల్డ్స్‌ వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరి యాగ్రిగేటర్స్‌తో పాటు ఫుడ్ ఫ్రాంచైజీలలో క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ పొందవచ్చు.

ఎంటర్‌టైన్మెంట్ : 
సోని లివ్ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌తో పాటు సినీపోలిస్‌లో సినిమా టిక్కెట్‌ల కొనుగోలుపై డిస్కౌంట్ ఆఫర్స్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ పొందవచ్చు.

ఫర్నిచర్, గృహాలంకరణ : 
పెప్పర్‌ఫ్రై, అర్బన్ ల్యాడర్, డ్యూరోఫ్లెక్స్ వంటి పేరున్న బ్రాండ్స్‌కి చెందిన ఉత్పత్తులపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

Trending News